కరోనా ఎఫెక్ట్.. ఏపీలో జూన్ 11 వరకు పాఠశాలలు క్లోజ్.!

Coronavirus Effect: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 303 కేసులు నమోదయ్యాయి. ఇందులో ముగ్గురు మృతి చెందారు. ఇదిలా ఉంటే కరోనా ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కరోనా కట్టడి చేసేందుకు తదుపరి కార్యాచరణలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే లాక్ డౌన్ ఎత్తివేసినా లేదా సడలించినా పాఠశాలలు తెరుచుకునే అవకాశం మాత్రం కనిపించట్లేదు. పాఠశాలలు తెరిస్తే విద్యార్ధులు […]

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో జూన్ 11 వరకు పాఠశాలలు క్లోజ్.!
Follow us

|

Updated on: Apr 07, 2020 | 9:38 AM

Coronavirus Effect: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 303 కేసులు నమోదయ్యాయి. ఇందులో ముగ్గురు మృతి చెందారు. ఇదిలా ఉంటే కరోనా ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనున్న సంగతి తెలిసిందే.

ఈ నేపధ్యంలో కరోనా కట్టడి చేసేందుకు తదుపరి కార్యాచరణలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే లాక్ డౌన్ ఎత్తివేసినా లేదా సడలించినా పాఠశాలలు తెరుచుకునే అవకాశం మాత్రం కనిపించట్లేదు. పాఠశాలలు తెరిస్తే విద్యార్ధులు గుమిగూడతారు కాబట్టి మూసివేయడమే మంచిదని ప్రభుత్వం ఆలోచిస్తోందట.

అటు అకాడిమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 23 వరకు స్కూళ్లు పని చేస్తాయి. ఒకవేళ ఈ నెల 14 తర్వాత తెరిచినా.. ఆదివారాలు పోనూ కేవలం ఏడు రోజులు మాత్రమే ఉన్నాయి. ఎలాగో 9వ తరగతి వరకు విద్యార్ధులను పరీక్షలు లేకుండా పాస్ చేసేశారు కాబట్టి.. జూన్ 11వ తేది వరకు స్కూళ్లను మూసి వేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది చదవండి: తెలంగాణ సర్కార్ సంచలనం.. ఇంటింటికీ ర్యాపిడ్ ఫీవర్ సర్వే..