తబ్లీగి జామాత్‌: హకీంపేట మజీదు ఇన్‌చార్జిపై క్రిమినల్ కేసు

తబ్లీగి జమాత్‌కు హాజరై హైదరాబాద్‌లో తలదాచుకుంటున్న ఆరుగురు మలేషియన్లపై బంజారాహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.

తబ్లీగి జామాత్‌: హకీంపేట మజీదు ఇన్‌చార్జిపై క్రిమినల్ కేసు
Follow us

| Edited By:

Updated on: Apr 07, 2020 | 9:41 AM

తబ్లీగి జమాత్‌కు హాజరై హైదరాబాద్‌లో తలదాచుకుంటున్న ఆరుగురు మలేషియన్లపై బంజారాహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. మలేషియాకు చెందిన హమీద్‌బిన్‌ జేహెచ్‌ గుజిలి, జెహ్రాతులామని గుజాలి, వారామద్‌ అల్‌ బక్రి వాంగ్, ఏబీడీ మన్నన్‌ జమాన్‌ బింతి అహ్మద్, ఖైరిలి అన్వర్‌ బాన్‌ అబ్దుల్‌ రహీం, జైనారియా టూరిస్ట్‌ వీసాపై ఇండియాకు వచ్చి.. న్యూఢిల్లీలో జరిగిన తబ్లీగి జమాత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తరువాత మలేషియా వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో లాక్‌డౌన్‌ ప్రకటించగా.. ఇక్కడే ఆగిపోయారు.

దీంతో న్యూఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్‌కు వచ్చిన ఆ ఆరుగురు హకీంపేట మసీదులో షెల్టర్‌ తీసుకున్నారు. మజీదు ఇన్‌చార్జి అనుమతితో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వీరు ఇక్కడ తలదాచుకున్నారు. ఇక కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న క్రమంలో సోదాలు నిర్వహిస్తోన్న పోలీసులు.. వీరిని గుర్తించారు. వీరిపై ఎపిడమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌తో పాటు ఐపీసీ సెక్షన్‌ 420, 269, 270, 188, 109, ఫారెనర్స్‌ యాక్ట్‌ కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేసి గాంధీ ఆస్పత్రికి తరలించి, క్వారంటైన్‌లో పెట్టారు. మరోవైపు ఈ ఆరుగురికి ఆశ్రయం కల్పించినందుకు హకీంపేట మజీదు ఇన్‌చార్జి మీద కూడా క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.

Read This Story Also: కరోనాపై పోరు: టీటీడీ ఉదార భావం.. భారీ విరాళంతో పాటు..!