కరోనా ఎఫెక్ట్: నిరుద్యోగ భృతికి కోటికి పైగా దరఖాస్తులు

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కోరలు చాచింది. కరోనా బారిన పడిన వారి సంఖ్య 4లక్షల పైనే చేరింది. 16వేలమందికి పైగా ఈ మహమ్మారితో మృత్యువాతపడ్డారు

కరోనా ఎఫెక్ట్: నిరుద్యోగ భృతికి కోటికి పైగా దరఖాస్తులు
Follow us

| Edited By:

Updated on: Apr 10, 2020 | 9:04 AM

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కోరలు చాచింది. కరోనా బారిన పడిన వారి సంఖ్య 4లక్షల పైనే చేరింది. 16వేలమందికి పైగా ఈ మహమ్మారితో మృత్యువాతపడ్డారు. దీంతో ఆర్థికంగానూ అగ్రరాజ్యం నష్టాల్లో కొనసాగుతోంది. అమెరికాలో చాలా సంస్థలు మూతపడ్డాయి. 48 రాష్ట్రాలు ప్రాధాన్యం కాని వ్యాపారాలను మూసివేశాయి. ఈ నేపథ్యంలో 3 వారాల వ్యవధిలోనే ప్రతి 10 మందిలో ఒకరు ఉద్యోగం కోల్పోగా.. నిరుద్యోగం అమాంతం పెరిగింది.

ఈ క్రమంలో నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకుంటోన్న వారి సంఖ్య పెరుగుతోంది. గత మూడు వారాల్లో నిరుద్యోగ భృతిని కోరుతూ దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 1.66కోట్లకు చేరింది. 1948 నుంచి చూస్తే.. ఇదే అతి పెద్ద ఉద్యోగాల నష్టంగా పరిగణిస్తున్నారు. కాగా ఈ నెలలో 2 కోట్ల మందికి పైగా అమెరికన్లు ఉద్యోగాలు పోగొట్టుకునే అవకాశాముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్‌లో నిరుద్యోగిత రేటు 15 శాతానికి చేరొచ్చని వారు చెబుతున్నారు.

Read This Story Also: అల్లు ఫ్యామిలీతోనే కాదు.. పవన్, నా మధ్య అలాంటి పుకార్లే వచ్చాయి