జూలైలో ఐపీఎల్.. కొత్త తేదీలు ఫిక్స్.?

జూలైలో ఐపీఎల్.. కొత్త తేదీలు ఫిక్స్.?

Coronavirus Effect On IPL: కరోనా వైరస్ కారణంగా వాయిదా పడ్డ ఐపీఎల్‌ నిర్వహణ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త తేదీలను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ లీగ్‌ను జూలైలో గానీ లేదా అక్టోబర్ నెలలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు. వాస్తవానికి మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఈ లీగ్.. కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్ 15కు వాయిదా పడింది. అయితే దేశంలో పాజిటివ్ కేసులు […]

Ravi Kiran

|

Apr 10, 2020 | 2:40 PM

Coronavirus Effect On IPL: కరోనా వైరస్ కారణంగా వాయిదా పడ్డ ఐపీఎల్‌ నిర్వహణ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త తేదీలను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ లీగ్‌ను జూలైలో గానీ లేదా అక్టోబర్ నెలలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు. వాస్తవానికి మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఈ లీగ్.. కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్ 15కు వాయిదా పడింది. అయితే దేశంలో పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం వల్ల ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. సోషల్ మీడియాలో అయితే టోర్నీ రద్దు అవుతుందని కూడా ప్రచారం సాగింది.

బీసీసీఐకు ఐపీఎల్‌తో వేల కోట్ల బిజినెస్ కమిట్మెంట్స్ ఉండటం వల్ల ఫ్యాన్స్ లేకుండానే లీగ్‌ను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అయితే ఇది కేవలం చివరి ఆప్షన్ మాత్రమేనని.. అప్పటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రేక్షకులను అనుమతిస్తే.. ఫ్యాన్స్‌ను స్టేడియంలలోకి అనుమతిస్తారని బీసీసీఐ చెబుతోంది. కాగా, ఈ సంవత్సరం ఐపీఎల్ రద్దైతే బీసీసీఐ రూ.5000 కోట్ల నుంచి రూ.7500 కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉంది. అదే జరిగితే ప్రపంచంలోనే అత్యధిక ధనవంతమైన క్రికెట్ బోర్డు ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు.

ఇవి చదవండి:

జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఓలా సర్వీసులకు గ్రీన్ సిగ్నల్..

సీఎం సంచలనం.. డాక్టర్లు, నర్సులకు డబుల్ శాలరీ..

ఏపీలో కరోనా రోగులకు పౌష్టికాహారం.. ఆరోగ్య ఆంధ్రా ట్వీట్ వైరల్..

దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులు.. మొదటి స్థానం, చివరి స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఇవే..

కేంద్రం ప్రకటన.. ఏప్రిల్ 14 జాతీయ సెలవు దినం..

తీరు మారని పాకిస్థాన్.. కరోనా భయంతో డాక్టర్లపై లాఠీచార్జ్..

ఏపీ తాజా హెల్త్ బులిటెన్.. తగ్గుతోన్న కరోనా కేసులు..

కేంద్రం కీలక నిర్ణయం.. పెరగనున్న అబార్షన్ల సంఖ్య.!

ఏప్రిల్ 15 నుంచి రైల్ జర్నీ.. కండీషన్స్ అప్లై..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu