Breaking News
 • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 65 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 165799. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89987. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 71106. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4706. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
 • రాజ్యసభ సెక్రటరియేట్లో ఒక విభాగానికి సీల్. అందులో పనిచేసే అధికారికి కోవిడ్-19 పాజిటివ్. శానిటైజ్ చేయడం కోసం కార్యాలయాన్ని సీల్ చేసిన అధికారులు.
 • మహారాష్ట్ర లో కరోనా విలయతాండవం. మహారాష్ట్ర లో ఈరోజు 2598 కరోనా పాజిటివ్ కేస్ లు,85 మంది మృతి. మహారాష్ట్ర రాష్ట్రంలో 59546 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. 1982 మంది మృతి.
 • అమరావతి: ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పిటిషన్ పై తీర్పు. ఏపీ ప్రభుత్వానికి SEC విషయంలో హైకోర్టు షాక్. SECగా నిమ్మగడ్డ ను విధుల్లోకి తీసుకోవాలన్న ఏపీ హైకోర్టు. నిమ్మగడ్డ తొలగింపు ఆర్డినెన్స్ కొట్టేసిన ఏపీ హైకోర్టు. వెంటనే నిమ్మగడ్డను విధుల్లోకి తీసువాలని తీర్పు ఇచ్చిన హైకోర్టు.
 • అచ్చెన్నాయుడు, టీడీఎల్పీ ఉప నేత. నిమ్మగడ్డ రమేశ్ ను ఈసీ గా కొనదగించాలని. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ఇప్పటికయినా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. కరోనా తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఈ సమయంలో కక్ష సాధింపు రాజకీయాలా.

ఏప్రిల్ 15 నుంచి రైల్ జర్నీ.. కండీషన్స్ అప్లై..!

Coronavirus Lockdown, ఏప్రిల్ 15 నుంచి రైల్ జర్నీ.. కండీషన్స్ అప్లై..!

Coronavirus Lockdown: కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా కేంద్రం విధించిన 21 రోజుల లాక్ డౌన్ ఈ నెల 14తోముగియనుంది. లాక్ డౌన్ ఎత్తివేస్తారా.? లేదా పొడిగిస్తారా.? అన్న అంశాలు పక్కన పెడితే.. రైళ్ల పునరుద్ధరణపై రైల్వే బోర్డు సమాయత్తమవుతోందని సమాచారం. అంతేకాకుండా క్రమపద్దతిలో ట్రైన్లను నడపాలన్న ఆలోచనలో కేంద్రం ఉందని తెలుస్తోంది. కరోనా నివారణ చర్యలు చేపడుతూనే ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేర్చే విధంగా ప్రణాళికలను సిద్దం చేస్తున్నారట. అందులో భాగంగానే అన్ని రైళ్లను కాకుండా కొన్ని ప్రత్యేక సర్వీసులను మాత్రమే నడపనున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా వీటిల్లో ప్రయాణించే ప్రయాణీకులకు నిబంధనలను కూడా విధించనున్నారు.

 • ట్రైన్‌లో స్లీపర్ కోచ్‌లు తప్పితే ఏసీ బోగీలు ఉండవు.
 • గతంలో మాదిరిగా అన్ని స్టేషన్లలో ఆపకుండా.. నాన్ స్టాప్ పద్దతిలో రైళ్లను నడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 • ప్రయాణానికి 12 గంటల ముందే ప్రయాణీకుడు తన ఆరోగ్య సమాచారాన్ని రైల్వే అధికారులకు అందజేయాలి.
 • బెర్త్ ఖరారైన వారికే ప్రయాణానికి అనుమతి.. అంతేకాకుండా క్యాబిన్‌లో ఇద్దరికీ మాత్రమే బెర్తులు కేటాయింపు.
 • ప్రయాణీకులు నాలుగు గంటల ముందే స్టేషన్‌కు చేరుకోవాలి.
 •  రైళ్లలో క్యాటరింగ్ సర్వీసులు ఉండవు
 • థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే కోచ్‌లలోకి అనుమతి
 • గ్లౌజులు, మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచుతారు.

ఇలా లాక్ డౌన్ తర్వాత రైలు ప్రయాణంలో పలు నిబంధనలను పెట్టే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రధాని మోదీ రాష్ట్రాల సీఎంలతో భేటి అనంతరం తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

ఇవి చదవండి:

జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఓలా సర్వీసులకు గ్రీన్ సిగ్నల్..

సీఎం సంచలనం.. డాక్టర్లు, నర్సులకు డబుల్ శాలరీ..

ఏపీలో కరోనా రోగులకు పౌష్టికాహారం.. ఆరోగ్య ఆంధ్రా ట్వీట్ వైరల్..

దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులు.. మొదటి స్థానం, చివరి స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఇవే..

జూలైలో ఐపీఎల్.. కొత్త తేదీలు ఫిక్స్.?

కేంద్రం ప్రకటన.. ఏప్రిల్ 14 జాతీయ సెలవు దినం..

తీరు మారని పాకిస్థాన్.. కరోనా భయంతో డాక్టర్లపై లాఠీచార్జ్..

ఏపీ తాజా హెల్త్ బులిటెన్.. తగ్గుతోన్న కరోనా కేసులు..

కేంద్రం కీలక నిర్ణయం.. పెరగనున్న అబార్షన్ల సంఖ్య.!

Related Tags