AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విఫలమైన మోదీ సర్కార్.. కొంచెం కూడా దయలేదంటూ…

కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో సామాన్య ప్రజానీకం ఉపాధిని కోల్పోయింది. అయితే వీరికోసం కేంద్ర ప్రభుత్వం రేషన్‌ ఇస్తున్నా.. ఇంట్లో మిగతా నిత్యవసర సరుకులకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే పేద ప్రజలపట్ల.. నిరుద్యోగుల పట్ల సహాయం చేయడంలో మోదీ సర్కార్‌ విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.చిదంబరం తన ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ‘‘ ఎంతో మంది ప్రజల వద్ద డబ్బులు […]

విఫలమైన మోదీ సర్కార్.. కొంచెం కూడా దయలేదంటూ...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 19, 2020 | 3:11 PM

Share

కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో సామాన్య ప్రజానీకం ఉపాధిని కోల్పోయింది. అయితే వీరికోసం కేంద్ర ప్రభుత్వం రేషన్‌ ఇస్తున్నా.. ఇంట్లో మిగతా నిత్యవసర సరుకులకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే పేద ప్రజలపట్ల.. నిరుద్యోగుల పట్ల సహాయం చేయడంలో మోదీ సర్కార్‌ విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.చిదంబరం తన ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

‘‘ ఎంతో మంది ప్రజల వద్ద డబ్బులు అయిపోయాయి. ఉచితంగా పంపిణీ చేసే ఆహారం కోసం ప్రజలు క్యూలైన్లలో బారులుతీరి నిలబడుతున్నారు. వీటికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. కానీ హృదయం లేని ఈ ప్రభుత్వం ఆ పేదలకోసం ఏమీ చేయట్లేదు. పేదప్రజల అవసరాల కోసం.. ఫుడ్‌ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ద్వారా ఉచితంగా ధాన్యాలను ఎందుకు పంచలేకపోతోంది? ప్రతి పేద కుటుంబానికి నగదు బదిలీ (క్యాష్ ట్రాన్స్‌ఫర్‌) చేయడం ద్వారా.. ఆ పేదల ఆకలి నుంచి ఎందుకు రక్షించడం లేదు.” అంటూ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ నుంచి మోదీ సర్కార్‌ను ప్రశ్నించారు.

There is overwhelming evidence that more and more people have run out of cash and are forced to stand in lines to collect free cooked food. Only a heartless government will stand by and do nothing.

— P. Chidambaram (@PChidambaram_IN) April 19, 2020