లాక్‌డౌన్‌ బేఖాతర్… అంత్యక్రియలకు 50 వేలకుపైగా ముస్లింలు హాజరు..

కరోనా వైరస్ ప్రభావం కారణంగా ప్రపంచదేశాలు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో ప్రజలు మృత్యువాతపడ్డారు. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్‌లో అనుకోని ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ మత పెద్ద అంత్యక్రియలకు ఏకంగా 50 వేలకు పైగా ప్రజలు హాజరు కావడంతో పోలీసులు ఏమి చేయలేకపోయారు. వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్ ఖలీఫత్‌ మజ్లిస్‌ నయీబ్‌ ఈ ఆమిరైన మౌలానా జుబెయిర్‌ అహ్మద్‌ అన్సారీ (55) శుక్రవారం సరైల్ […]

  • Ravi Kiran
  • Publish Date - 3:03 pm, Sun, 19 April 20
లాక్‌డౌన్‌ బేఖాతర్... అంత్యక్రియలకు 50 వేలకుపైగా ముస్లింలు హాజరు..

కరోనా వైరస్ ప్రభావం కారణంగా ప్రపంచదేశాలు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో ప్రజలు మృత్యువాతపడ్డారు. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్‌లో అనుకోని ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ మత పెద్ద అంత్యక్రియలకు ఏకంగా 50 వేలకు పైగా ప్రజలు హాజరు కావడంతో పోలీసులు ఏమి చేయలేకపోయారు.

వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్ ఖలీఫత్‌ మజ్లిస్‌ నయీబ్‌ ఈ ఆమిరైన మౌలానా జుబెయిర్‌ అహ్మద్‌ అన్సారీ (55) శుక్రవారం సరైల్ ఉపజిలాలోని బెర్తెలా గ్రామలో కన్నుమూశారు. ఇక స్థానిక మదర్సాలో శనివారం నాడు ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోయినా.. ఢాకాతో సహా చుట్టుప్రక్కల ఉన్న పలు ప్రాంతాల నుంచి ఊహించని రీతిలో వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కరోనా కారణంగా ప్రభుత్వం నిర్దేశించిన సామాజిక దూరాన్ని కూడా పాటించకుండా ఏకంగా 50 వేలు పైగా ప్రజలు హాజరయ్యారని అక్కడి మీడియా పేర్కొంది.

కాగా, దేశంలో గుమిగూడటం నిషేధించినప్పుడు.. ఈ ఘటన ఎలా చోటు చేసుకుందో.. అంతమంది జనం ఎలా హాజరయ్యారో తమ ఊహకు అందడం లేదని ఆ జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ ఇక్రమ్ ఉల్లా పేర్కొన్నారు. ఇక బంగ్లాదేశ్‌లో ఇప్పటివరకు 2,144 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 84 మంది మృతిచెందారు.

Also Read:

కరోనా వేళ.. నార్త్ కొరియా అధ్యక్షుడు అదృశ్యం.. అసలు ఏమైంది.?

మూడు నెలలు అద్దె అడగకండి… సర్కార్ కీలక నిర్ణయం..

ఏపీలో ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు.. అదంతా ఫేకేనట.. అసలు నిజమిదే..

మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

Breaking: మే 7 వరకు తెలంగాణలో స్విగ్గీ, జోమాట బ్యాన్…

Breaking: మే నెలలోనూ రేషన్ ఫ్రీ.. వలస కూలీలకు కూడా…