మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

ఒకవైపు కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు చర్యలు చేపడుతూనే.. మరో వైపు లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వాళ్లను ఆదుకుంటోంది జగన్ సర్కార్. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కారణంగా మూడు నెలల పాటు చేపల వేటపై నిషేధం ఉన్న క్రమంలో మత్స్యకారులను ఆదుకునేందుకు జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లబ్దిదారుల కుటుంబాలకు 20 రోజుల్లో వేట విరామ సాయంగా రూ. 10 వేలు అందించాలని […]

మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
Follow us

|

Updated on: Apr 18, 2020 | 6:18 PM

ఒకవైపు కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు చర్యలు చేపడుతూనే.. మరో వైపు లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వాళ్లను ఆదుకుంటోంది జగన్ సర్కార్. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కారణంగా మూడు నెలల పాటు చేపల వేటపై నిషేధం ఉన్న క్రమంలో మత్స్యకారులను ఆదుకునేందుకు జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లబ్దిదారుల కుటుంబాలకు 20 రోజుల్లో వేట విరామ సాయంగా రూ. 10 వేలు అందించాలని నిర్ణయించింది. ఇక ప్రస్తుతం అధికారులు లబ్దిదారుల వివరాలు సేకరిస్తున్నారు. కాగా, ఇదివరకే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది నవంబర్ 21న 1,02,338 మందికి వేట విరామ సాయం అందించిన సంగతి తెలిసిందే.

కాగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 603కి చేరుకుంది. రాష్ట్రంలో కొత్తగా మరో 31 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసుల్లో కృష్ణా జిల్లాల్లో 18.  కర్నూల్ లో 5,   నెల్లూరులో 3, ప్రకాశం 2,  పశ్చిమ గోదావరిలో ఒక కేసు నమోదైంది. కాగా.. కర్నూల్ లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. మొత్తం 603 కేసులలో ఇప్పటి వరకూ 15 మంది మరణించగా, 42 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.. మిగిలిన 546 మంది రాష్ట్రంలోని వివిధ హాస్పటల్స్ లో చికిత్స పొందుతున్నారు.

Also Read:

‘రంజాన్’ వరకు లాక్‌డౌన్ పొడిగించాలి.. ముస్లిం కార్యకర్త వినతి..

శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలకు షాక్.. గుర్తింపు రద్దు చేసిన ఇంటర్ బోర్డు..