తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా
రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కోవిడ్ బారినపడి కోలుకోగా తాజాగా మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది..
రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కోవిడ్ బారినపడి కోలుకోగా తాజాగా మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి బుధవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో ఐసోలేషన్‌కు వెళ్లారు. అయన వ్యక్తి గత సిబ్బందితో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు… ఎమ్మెల్యే తో గత వారం రోజులుగా కాంటాక్ట్ లో ఉన్న వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు కోరారు.
కాగా,నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కరోనాబారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్ ఇటీవల కోవిడ్‌బారినపడి చికిత్స పొందుతున్నారు.. ఈ నలుగురు ఎమ్మెల్యేలు కోలుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
కరోనా మృతదేహం..ఖననం చేసేందుకు ముందుకురాని భార్యాబిడ్డలు.. ఆరోగ్య శాఖకు 6 కోవిడ్ రెస్పాన్స్ వెహికిల్స్: మంత్రి కేటీఆర్ సర్కార్ ఆస్పత్రిలో నకిలీ డాక్టర్ చేతివాటం