సర్కార్ ఆస్పత్రిలో నకిలీ డాక్టర్ చేతివాటం

ఓ వైపు కరోనా మహమ్మారి ప్రజలకు కంటిమీద కనుకులేకుండా చేస్తోంది. మరోవైపు ఇదే అదునుగా కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అందరికీ అవసరమైన మాస్క్‌లు, శానిటైజర్ మొదలు,..పీపీఈ కిట్ల వరకు ప్రతిదాంట్లోనూ అక్రమాలకు తెరలేపుతున్నారు. అంతేకాదు..

సర్కార్ ఆస్పత్రిలో నకిలీ డాక్టర్ చేతివాటం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 30, 2020 | 12:02 PM

ఓ వైపు కరోనా మహమ్మారి ప్రజలకు కంటిమీద కనుకులేకుండా చేస్తోంది. మరోవైపు ఇదే అదునుగా కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అందరికీ అవసరమైన మాస్క్‌లు, శానిటైజర్ మొదలు,..పీపీఈ కిట్ల వరకు ప్రతిదాంట్లోనూ అక్రమాలకు తెరలేపుతున్నారు. అంతేకాదు..కరోనా కాలంలో పలుచోట్ల నకిలీ వైద్యులు కూడా తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తాజాగా విజయవాడలో ఓ నకిలీ లేడీ డాక్టర్ హల్‌చల్ చేసింది.

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో నకిలీ వైద్యురాలు హల్‌చల్ చేసింది. పీపీఈ కిట్ ధరించి రోగుల బంధువుల నుంచి సదరు మహిళ నకిలీ డాక్టర్ డబ్బులు వసూలు చేసింది. కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితి చెబుతానంటూ డబ్బు వసూలు చేసంది. డాక్టర్ శైలజ పేరుతో ఆస్పత్రిలో మహిళ తిరుగుతుండగా.. అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగలోకి దిగిన పోలీసులు నకిలీ డాక్టర్, ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. మహిళపై గతంలో అనేక కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

Read More:

చిత్రపరిశ్రమలో విషాదం..మరో నటుడు ఆత్మహత్య

సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు..