డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో గోపీచంద్?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాహో' మూవీతో మంచి పేరు సంపాదించుకున్నాడు డైరెక్టర్ సుజీత్. ఈ సినిమా దేశ వ్యాప్తంగా మంచి వసూళ్లనే రాబ్టటినా.. తెలుగు బాక్సాఫీస్ ముందు మాత్రం ఢీలా పడింది. అయినా డైరెక్టర్ సుజీత్‌కి మంచి మార్కులు పడ్డాయి. దీంతో మెగాస్టార్ చిరంజీవి 'లూసిఫర్' తెలుగు రీమేక్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’ మూవీతో మంచి పేరు సంపాదించుకున్నాడు డైరెక్టర్ సుజీత్. ఈ సినిమా దేశ వ్యాప్తంగా మంచి వసూళ్లనే రాబ్టటినా.. తెలుగు బాక్సాఫీస్ ముందు మాత్రం ఢీలా పడింది. అయినా డైరెక్టర్ సుజీత్‌కి మంచి మార్కులు పడ్డాయి. దీంతో మెగాస్టార్ చిరంజీవి ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ఛాన్స్ కొట్టేశాడు సుజీత్. అయితే స్క్రిప్ట్ రెడీ చేసి, చిరును కన్విన్స్ చేయటంలో మాత్రం విఫలమయ్యాడు ఈ యంగ్ డైరెక్టర్. ఇక అందులోనూ కరోనా వైరస్ కారణంగా షూటింగ్స్ అన్నీ కాన్సిల్ అయ్యాయి. దాదాపు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఈ సినిమాను ప్రస్తుతానికి చిరు పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది.
దీంతో సుజీత్ మరికొన్ని కథలను సిద్ధం చేసుకున్నాడట. వాటిల్లో ఓ కథ ప్రభాస్‌కి నచ్చడంతో తన హోం బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్‌లో దాన్ని నిర్మించేందుకు వంశీ, ప్రమోద్‌లను ఒప్పించారట. అయితే ఇందులో గోపీ చంద్ హీరోగా చేస్తున్నాడట. ఇక అలాగే ఇందులోనూ శర్వానంద్ కూడా ఓ కీలక రోల్‌లో నటిస్తున్నాడని సమాచారం. వర్షం సినిమా నుంచి ప్రభాస్, గోపీ చంద్‌లు మంచి స్నేహితులు కావడంతో.. ఈ కథని రిఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ కాంబో సెట్ అవ్వడానికి పూర్తి కారణం ప్రభాస్ అంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. మొత్తానికి మరో రెండు, మూడు నెలల్లో ఈ స్క్రిప్ట్ పూర్తవుతుందని, ఈ లోపు మిగిలిన నటీనటులను ఫైన్ చేయబోతున్నట్లు సమాచారం.
Read More:
వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్! శాశ్వతంగా నోటిఫికేషన్లు మ్యూట్ చేసేలా..