లక్కంటే ఇలా వుండాలి… కారు కొట్టుకుపోయినా…
అనంతపురం జిల్లా ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది వర్షాలు పడుతున్నాయి. గుత్తి మండలం రజాపురం వద్ద పొంగి పొర్లుతున్న వాగును దాటేందుకు ప్రయత్నించి ప్రమాదంలో చిక్కుకున్నారు...
Car Washed Away in Flood : జోరు వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అనంతపురం జిల్లా ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది వర్షాలు పడుతున్నాయి. గుత్తి మండలం రజాపురం వద్ద పొంగి పొర్లుతున్న వాగును దాటేందుకు ప్రయత్నించి ప్రమాదంలో చిక్కుకున్నారు ఓ ఇద్దరు యువకులు. గురువారం ఉదయం రాకేశ్, యూసూఫ్ కడప నుంచి బిజాపూర్‌కు కారులో బయల్దేరారు. 63వ జాతీయ రహదారిపై రజాపురం వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తన్నప్పటికీ కారులో వాగుదాటే ప్రయత్నం చేశారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ వాగును గుంతకల్లు వైపు వస్తున్న కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు దాటేసింది. అయితే దాని వెనుకాలే కారును వాగు దాటించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బస్సు ఆవతలి ఒడ్డుకు చేరుకోగా, కారు మధ్యలోనే ఆగిపోయింది. వరద ఉధృతికి కొట్టుకు పోయింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి కారులో కొట్టుకుపోతున్న ఇద్దరినీ కాపాడారు. కారు మాత్రం వాగులోనే కొట్టుకుపోయింది. కొంచెం ఉంటే… ప్రవాహ వేగానికి బస్సు కూడా కొట్టుకుపోయేదని, తృటిలో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు.
#WATCH Andhra Pradesh: A car with 2 passengers inside gets washed away in Anantapur while crossing a rivulet. pic.twitter.com/LTKTLTltYU
— ANI (@ANI) July 30, 2020