ఉచిత వైద్యం.. కరోనా బాధితులకు సీఎం భరోసా

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సమయంలో ఒడిశా ప్రజలకు ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్‌ భరోసా ఇచ్చారు. మన ప్రజల రక్షణ విషయంలో నిధులు ఎప్పుడూ అడ్డంకి అవ్వవని పేర్కొన్న ఒడిశా సీఎం

ఉచిత వైద్యం.. కరోనా బాధితులకు సీఎం భరోసా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 30, 2020 | 4:50 PM

Naveen Patnaik assures: కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సమయంలో ఒడిశా ప్రజలకు ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్‌ భరోసా ఇచ్చారు. మన ప్రజల రక్షణ విషయంలో నిధులు ఎప్పుడూ అడ్డంకి అవ్వవని పేర్కొన్న ఒడిశా సీఎం.. ప్రయాణం మొదలు క్వారంటైన్‌, టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌, ఆహారం, వసతి అన్నీ ఉచితంగా అందిస్తామని తెలిపారు. ప్రస్తుత కరోనా పరిస్థితులపై మాట్లాడిన ఆయన.. ”ఇది ప్రకృతి వైపరిత్యమో లేక మహమ్మారో తెలీదు. కానీ ప్రతి ఒక్కరిని కాపాడుకోవడమే నా ముందున్న మొదటి కర్తవ్యం. నాలుగున్నర కోట్ల నా కుటుంబానికి నేను ఇచ్చే సూచన ఒక్కటే. రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేషించిన మార్గదర్శకాలను పాటించండి” అని నవీన్ పట్నాయక్ అన్నారు. కరోనాపై పోరులో భాగంగా ప్రతి ఒక్కరు వ్యక్తిగత బాధ్యతలను తీసుకోవాలని చెప్పుకొచ్చారు.

”ఇలాంటి పరిస్థితుల్లో విరామం లేకుండా పనిచేయడమన్నది సులభంతో కూడుకున్న పని కాదు. కానీ మన కరోనా వారియర్లు 150 రోజులుగా ఎనలేని సేవలను చేస్తున్నారు. ఈ క్రమంలో వారు కూడా జీవితాలను కోల్పోతున్నారు. వారి సేవలు మరవలేనివి” అని అన్నారు. చాలా రాష్ట్రాల్లో కరోనా వస్తే చికిత్స కోసం లక్షల రూపాయలను తీసుకుంటున్నారని, కానీ ఇక్కడ అంత ఉచితమని తెలిపారు. కరోనా వస్తే ప్రపంచం మొత్తం ఎలాంటి చికిత్స అందిస్తుందో అదే చికిత్సను ఇక్కడ అందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో రికవరీ రేటు కూడా చాలా బావుందని కితాబిచ్చారు. ఏ పరిస్థితి వచ్చినా ఒడిశా తట్టుకొని నిలబడుతుందని ఆయన అన్నారు. ఓ వైపు కరోనాపై పోరాటం చేస్తూనే మరోవైపు రాష్ట్ర అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టినట్లు నవీన్ పట్నాయక్‌ చెప్పుకొచ్చారు.

Read This Story Also: సుశాంత్‌ కేసులో మరో ట్విస్ట్‌.. వీడియో లీక్‌