సమతా పార్టీ మాజీ చీఫ్ జయాజైట్లీకి, మరో ఇద్దరికి 4 ఏళ్ళ జైలుశిక్ష

రక్షణకు సంబంధించిన ఓ వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణపై సమతా పార్టీ మాజీ చీఫ్ జయాజైట్లీకి, మరో ఇద్దరికి ఢిల్లీలోని ఓ కోర్టు 4 ఏళ్ళ జైలు శిక్షను విధించింది. వీరికి లక్ష రూపాయల జరిమానా కూడా విధిస్తూ కోర్టు తీర్పు..

సమతా పార్టీ మాజీ చీఫ్ జయాజైట్లీకి, మరో ఇద్దరికి 4 ఏళ్ళ జైలుశిక్ష
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 30, 2020 | 3:55 PM

రక్షణకు సంబంధించిన ఓ వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణపై సమతా పార్టీ మాజీ చీఫ్ జయాజైట్లీకి, మరో ఇద్దరికి ఢిల్లీలోని ఓ కోర్టు 4 ఏళ్ళ జైలు శిక్షను విధించింది. వీరికి లక్ష రూపాయల జరిమానా కూడా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 2000-2001 సంవత్సరంలో వీరు రక్షణ శాఖకు సంబంధించి థర్మల్ ఇమేజర్ల కొనుగోలులో అవినీతికి, కుట్రకు పాల్పడిన కేసులో దోషులని ఢిల్లీ లోని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి వీరేందర్ భట్ పేర్కొన్నారు. జయా జైట్లీతో బాటు ఆమె పార్టీ మాజీ సహచరుడు గోపాల్ పచెర్వాల్, మాజీ మేజర్ జనరల్ ఎస్.పి.మురుగై కూడా ఈ కేసులో దోషులుగా తేలారు. వీరు గురువారం సాయంత్రం ఐదుగంటలకల్లా లొంగిపోవాలని కూడా కోర్టు ఆదేశించింది.

2001 లో నాటి ట్ తెహెల్కా డాట్ కామ్ పోర్టల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ ..’ఆపరేషన్ వెస్టెన్డ్’ లో ఈ ముగ్గురూ ముడుపులు తీసుకున్నట్టు వెల్లడైంది. నాడు జయా జైట్లీ, రెండు లక్షల రూపాయలు, మురుగై 20 వేలు అందుకున్నట్టు ఆ పోర్టల్ వీరి గుట్టును రట్టు చేసింది.