వంద మందిని హత్య చేసిన.. కిల్లర్ డాక్టర్ అరెస్ట్!
ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో వందకు పైగా హత్యలు చేసిన కిల్లర్ డాక్టర్ దేవేంద్ర శర్మను ఎట్టకేలకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన నార్కోటిక్స్ సెల్ ఢిల్లీలోని బాప్‌రైలాలో అరెస్టు చేసింది. ఇప్పటివరకు
ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో వందకు పైగా హత్యలు చేసిన కిల్లర్ డాక్టర్ దేవేంద్ర శర్మను ఎట్టకేలకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన నార్కోటిక్స్ సెల్ ఢిల్లీలోని బాప్‌రైలాలో అరెస్టు చేసింది. ఇప్పటివరకు డాక్టర్ శర్మ 100 మందికి పైగా ట్రక్, టాక్సీ డ్రైవర్లను హత్యచేశారనే ఆరోపణలున్నాయి. హత్యలు 100 మార్కుకు చేరడంతో వాటిని ఆపివేసినట్లు నిందితుడు డాక్టర్ శర్మ(62) తెలిపాడు. దేశంలోని పలు రాష్ట్రాలలో నడిచిన కిడ్నీ రాకెట్‌తో డాక్టర్ శర్మకు సంబంధాలున్నాయి.
మర్డర్ కేసులో జైల్లో ఉన్న సీరియల్ కిల్లర్ డాక్టర్ శర్మ 2020 జనవరిలో పెరోల్ జంప్ చేసి, ఢిల్లీలోని బాప్‌రైలాలో దాక్కున్నట్లు నార్కోటిక్స్ సెల్ ఇన్‌స్పెక్టర్ రామ్ మనోహర్‌కు సమాచారం అందిందని క్రైమ్ బ్రాంచ్ డీసీసీ డాక్టర్ రాకేశ్ పొవారియా తెలిపారు. ఆయన పర్యవేక్షణలో పోలీసుల బృందం డాక్టర్ దేవేంద్ర కుమార్ శర్మ (62)ను అరెస్ట్ చేసింది.
శర్మ తొలుత ఢిల్లీలోని లోని మోహన్ గార్డెన్‌లోని ఒక పరిచయస్తుడి ఇంట్లో ఉండేవాడు, తరువాత అతను బాప్రోలాకు వెళ్లాడు, అక్కడ ఒక వితంతువును వివాహం చేసుకుని అజ్ఞాతంలో ఉంటున్నాడు. దీనిపై జైపూర్ పోలీసులకు సమాచారం అందింది. డాక్టర్ దేవేంద్ర శర్మకు బీఏఎంఎస్ డిగ్రీ మాత్రమే ఉంది. అయితే కిడ్నీని సేకరించడంతో పాటు అవయవ మార్పిడి శస్త్రచికిత్స కూడా చేసేవాడు. ఈ సీరియల్ కిల్లర్‌ను తీసుకువెళ్లేందుకు జైపూర్ పోలీసులు ఢిల్లీకి రానున్నారు.
Read More:
గుడ్ న్యూస్: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 26,778 మెడికల్ పోస్టుల భర్తీ!
జీహెచ్ఎంసీలో మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌లు.. గంటకు 500 పరీక్షలు..!