సుశాంత్ సింగ్ కేసు, రూ. 15 కోట్ల లావాదేవీలు జరిగాయా ?

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసులో మరో కొత్త కోణం బయటపడింది. ఇది క్రమంగా ఆర్థిక నేరాల దర్యాప్తు పరిధిలోకి చేరుతోంది. ఈ కేసులో రూ. 15 కోట్ల విలువైన 'అనుమానాస్పద లావాదేవీలు' జరిగాయన్న..

సుశాంత్ సింగ్ కేసు, రూ. 15 కోట్ల లావాదేవీలు జరిగాయా ?
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 30, 2020 | 5:32 PM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసులో మరో కొత్త కోణం బయటపడింది. ఇది క్రమంగా ఆర్థిక నేరాల దర్యాప్తు పరిధిలోకి చేరుతోంది. ఈ కేసులో రూ. 15 కోట్ల విలువైన ‘అనుమానాస్పద లావాదేవీలు’ జరిగాయన్న ఆరోపణలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది. సుశాంత్ తండ్రి కేకే ఖాన్.. బీహార్ పోలీసు స్టేషన్ లో దాఖలు చేసిన కేసు వివరాలను ఈడి… ఆ రాష్ట్ర పోలీసుల నుంచి కోరింది.  సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, ఆమె సోదరుడు, మరోఆరుగురు తన కుమారుడి మృతికి కారణమని ఆయన తండ్రి ఇదివరకే పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేలా వారు ప్రేరేపించారని ఆయన ఆరోపించారు.

కాగా ఈ కేసుకు సంబంధించి ఎఫ్ ఐ ఆర్ కాపీని తమకు సమర్పించాలని ఈడీ అధికారులు బీహార్ పోలీసులను కోరారు. ఈ కేసులో పదిహేను కోట్ల రూపాయల విలువైన అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు మేం భావిస్తున్నాం.. బహుశా ఇందులో మనీ లాండరింగ్ కోణం కూడా ఉన్నట్టు  ఉంది.. ప్రస్తుతానికి మనీ లాండరింగ్ కేసు నమోదు చేయనప్పటికీ.. పోలీసుల నుంచి అన్ని వివరాలు తెలుసుకున్నాక ఓ నిర్ణయం తీసుకుంటాం అని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ కేసును సీబీఐ కి అప్పగించాలని కోరుతూ దాఖలైన అప్పీలును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై బాంబే హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్ కు కోర్టు సూచించింది.