జీహెచ్ఎంసీలో మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లు.. గంటకు 500 పరీక్షలు..!
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకొని ప్రాంతీయ, జిల్లా
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకొని ప్రాంతీయ, జిల్లా, బోధనాసుపత్రులన్నింటిలోనూ కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా.. తాజాగా ఈ సేవలను మరింత విస్తరించింది. ఇక నుంచి ప్రజల చెంతకే కరోనా నిర్ధారణ పరీక్షల కేంద్రం తరలిరానుంది. కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో తొలుత వీటిని వినియోగిస్తారు. నేటి నుంచే సేవలు ప్రారంభంకానున్నాయి. 20 సంచార వాహనాలను ఇందుకోసం సిద్ధం చేశారు.
తొలుత జీహెచ్‌ఎంసీ పరిధిలోని కంటెయిన్‌మెంట్ జోన్లలో వీటిని ఉపయోగిస్తారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ బస్సుల్లో ఒకేసారి 10 మందికి నమూనాలను సేకరించేందుకు వీలుగా.. ఒక్కో బస్సులో 10 కేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటి ద్వారా యాంటీజెన్ పరీక్షలతో అక్కడికక్కడే ఫలితాలు వెల్లడవుతాయి. లక్షణాలుండి యాంటీజెన్ పరీక్షల్లో నెగిటివ్‌గా తేలినవారిలో.. అవసరాలకు అనుగుణంగా ఆర్‌టీ-పీసీఆర్ విధానంలో పరీక్షించేందుకు వీలుగా కూడా నమూనాలు సేకరిస్తారు. ఆ నమూనాలను ప్రభుత్వ నిర్ధారణ పరీక్ష కేంద్రాలకు పంపిస్తారు. ‘వెర స్మార్ట్ హెల్త్’ సంస్థ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తారు.
Also Read: గుడ్ న్యూస్: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 26,778 మెడికల్ పోస్టుల భర్తీ!