ఇళ్లలోనే వినాయకుడి వేడుకలు: మంత్రి ఐకే రెడ్డి పిలుపు
కరోనా నేపథ్యంలో వినాయక చవితి వేడుకలను నిరాడంబరంగా, జనసమూహం లేకుండా ఎవరింట్లో వారే జరుపుకోవాలని, సామూహిక నిమజ్జనాలు వద్దని దేవాదాయ శాఖ మంత్రి..
కరోనా నేపథ్యంలో వినాయక చవితి వేడుకలను నిరాడంబరంగా, జనసమూహం లేకుండా ఎవరింట్లో వారే జరుపుకోవాలని, సామూహిక నిమజ్జనాలు వద్దని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రంజాన్, ఉగాది, శ్రీరామ నవమి, బోనాల వంటి పండుగలను నిరాడంబరంగా జరుపుకున్నామని తెలిపారు. వినాయక చవితి పండగను కూడా ఎలాంటి ఆర్భాటం లేకుండా నిర్వహించుకోవాలని, దీనికి ప్రజలందరూ సహాకరించాలని కోరారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి ప్రతిమలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
Read More:
శ్రీవారిని దర్శించుకున్న ‘రష్యా యువతి’ రాయలసీమ ఎత్తిపోతలకు కృష్ణా బోర్డు బ్రేక్ తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా కంటతడి పెట్టుకున్న వైసీపీ మహిళా ఎమ్మెల్యే