ఆగస్టు 1న పెన్షన్ల పంపిణీ.. కొత్తగా 2.20 లక్షల మందికి లబ్ది..!

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం.. ఈ నెల పెన్షన్‌ ను ఆగస్టు 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల చేతికే

ఆగస్టు 1న పెన్షన్ల పంపిణీ.. కొత్తగా 2.20 లక్షల మందికి లబ్ది..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 30, 2020 | 4:55 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం.. ఈ నెల పెన్షన్‌ ను ఆగస్టు 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల చేతికే నేరుగా అందించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ మేరక ఒకేరోజు 61.28 లక్షల మంది పెన్షనర్ల ఇంటి వద్దకే వెళ్లి, నేరుగా వారి చేతికే పెన్షన్ సొమ్మును అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 2.68 లక్షల మంది వాలంటీర్లు పెన్షన్ సొమ్మును పంపిణీ చేసేందుకు సిద్ధంగా వున్నారు.

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద అందించే పెన్షన్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.1478.90 కోట్ల రూపాయలను విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల ఖాతాలకు ఇప్పటికే పెన్షన్సొమ్మును జమచేశారు. వాలంటీర్లు ఈ సొమ్మును నేరుగా లబ్ధిదారుల ఇళ్లకువెళ్లి అందించనున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నెల కూడా పెన్షనర్ల బయోమెట్రిక్‌కు బదులు జియో ట్యాగింగ్‌తో కూడిన ఫోటోలను తీసుకుని, పెన్షన్ అందిస్తారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) సీఈఓ తెలిపారు.

కాగా.. జూలై నెలలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి, వారికి దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లోనే పెన్షన్ మంజూరు కార్డులను అందచేశామమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ నెలలో కొత్తగా మంజూరు చేసిన 2,20,385 మందికి కూడా ఆగస్టు 1వ తేదీ నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కొత్తగా మంజూరు చేసిన పెన్షన్‌లకు రూ.51.67 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.

Read More:

గుడ్ న్యూస్: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 26,778 మెడికల్‌ పోస్టుల భర్తీ!

జీహెచ్​ఎంసీలో మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్​లు.. గంటకు 500 పరీక్షలు..!