ఏపీలో కరోనా రోగుల ఫుడ్ మెనూలో మార్పులు..!

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా బారిన పడిన వారు త్వరగా కోలుకునేందుకు, వారిలో రోగనిరోధక శక్తి పెరిగేందుకు ప్రభుత్వం బలమైన ఆహారాన్ని అందిస్తోంది.

ఏపీలో కరోనా రోగుల ఫుడ్ మెనూలో మార్పులు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 30, 2020 | 4:20 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా బారిన పడకుండా మాస్క్ ధరించడం, తరచూ శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూనే సరైన పౌష్ఠిక ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ క్రమంలో కరోనా బారిన పడిన వారు త్వరగా కోలుకునేందుకు, వారిలో రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం బలమైన ఆహారాన్ని అందిస్తోంది. ఇందుకోసం స్పెషల్ మెనూను పాటిస్తోంది. ప్రతిరోజూ ఉదయం రాగిజావ, బెల్లం, పాలను అందిస్తుండగా.. రోజుకో టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనంలో వివిధ వెరైటీలను అందిస్తోంది. వైద్యుల సూచనలతో మెనూలో మార్పులు చేస్తోంది.

[svt-event date=”30/07/2020,4:09PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Read More:

గుడ్ న్యూస్: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 26,778 మెడికల్‌ పోస్టుల భర్తీ!

జీహెచ్​ఎంసీలో మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్​లు.. గంటకు 500 పరీక్షలు..!