తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆగష్టు 15 నుంచి వీడియో పాఠాలు!

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డిజిటల్ బోధనను ప్రారంభించేందుకు సన్నద్ధం అవుతోంది. టీశాట్, దూరదర్శన్‌ యాదగిరి చానళ్ల ద్వారా ఆగష్టు 15 నుంచి ప్రసారం చేసేలా కసరత్తు చేస్తోంది.

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆగష్టు 15 నుంచి వీడియో పాఠాలు!
Follow us

|

Updated on: Jul 30, 2020 | 4:24 PM

Digital Classes For Telangana Students: కరోనా వైరస్ అన్నింటినీ మార్చేసింది. ముఖ్యంగా విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపించింది. స్కూళ్లు, విద్యాసంస్థలు మూతపడటంతో విద్యార్ధుల భవిష్యత్తు ప్రశార్ధకరంగా మారింది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్‌లైన్‌ ద్వారా పాఠాలు బోధించేందుకు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కూడా డిజిటల్ బోధనను ప్రారంభించేందుకు సన్నద్ధం అవుతోంది.

ప్రాధమిక తరగతులకు వర్క్ షీట్స్, అసైన్‌మెంట్స్‌ ఇవ్వడంతో పాటు 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్ధులకు వీడియో పాఠాలను ప్రసారం చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే 900 పైచిలుకు డిజిటల్ పాఠాలను రూపొందించారు. వీటిని టీశాట్, దూరదర్శన్‌ యాదగిరి చానళ్ల ద్వారా ఆగష్టు 15 నుంచి ప్రసారం చేసేలా కసరత్తు చేస్తోంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ‘ప్రజ్ఞత’ పేరుతో ఆన్‌లైన్, డిజిటల్ విద్యకు రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ టైం టేబుల్‌ను సిద్ధం చేసింది.

ఇదిలా ఉంటే విద్యార్థులకు వచ్చే డౌట్స్‌ను నివృత్తి చేసేందుకు ఒక్కో తరగతికి ఒక రోజు కేటాయించేలా చర్యలు తీసుకుంటోంది. ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సబ్జెక్టు టీచర్లను అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక గ్రామాల్లో ఉన్న విద్యార్థులు నేరుగా స్కూల్‌కు వెళ్లి నేర్చుకునేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తోంది. దీని కోసం టీచర్లను రొటేషన్ పద్దతిలో స్కూళ్లలో అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతోంది. ఎంతమందిని ఉంచాలి.? మిగిలిన అంశాలపై ప్రభుత్వానిదే తుది నిర్ణయం అని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.

Also Read:

ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు