కరోనా ఎఫెక్ట్: ఏపీలో 58 వేల వాహనాలు సీజ్.. 17 వేల మంది అరెస్ట్!

ఏపీ ప్రభుత్వం తాజాగా కరోనా వైరస్ నిబంధల్ని ఉల్లంఘించి బుక్కైన వారి వివరాల్ని తెలిపింది. ఇప్పటివరకూ రాష్ట్ర పోలీస్ శాఖ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 9.76 లక్షల కేసులు నమోదు చేశారు. అలాగే 58,000 ఎఫ్ఐఆర్‌లు కేసులు..

కరోనా ఎఫెక్ట్: ఏపీలో 58 వేల వాహనాలు సీజ్.. 17 వేల మంది అరెస్ట్!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 05, 2020 | 2:41 PM

కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం మార్చి 22 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్ అమలులో ఉంది. ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప.. అనవసరంగా రోడ్లపైకి రావొద్దని మొదటి రోజు నుంచీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ కోరుతూ వచ్చాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఇరు రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే హెచ్చరించారు. అయినా లెక్క చేయకుండా అకారణంగా రోడ్లపైకి వచ్చినవారిపై కేసులు నమోదు చేశారు ఏపీ పోలీసులు.

ఏపీ ప్రభుత్వం తాజాగా కరోనా వైరస్ నిబంధల్ని ఉల్లంఘించి బుక్కైన వారి వివరాల్ని తెలిపింది. ఇప్పటివరకూ రాష్ట్ర పోలీస్ శాఖ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 9.76 లక్షల కేసులు నమోదు చేశారు. అలాగే 58,000 ఎఫ్ఐఆర్‌లు కేసులు నమోదయినట్లు తెలిపారు. కాగా ఒక్కసారి ఎఫ్ఐఆర్ నమోదైతే.. ఆ మచ్చ జీవితాంతం అలాగే ఉంటుందని పేర్కొన్నారు పోలీసులు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు.. మీపై ఏమైనా ఎఫ్ఐఆర్ కేసులు నమోదయ్యాయా? అని చెక్ చేస్తారు అధికారులు. దీంతో ప్రజలందరూ ఇది గమనించి, జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకూ నిబంధనలు పాటించని 58 వేల వాహనాల్ని సీజ్ చేశారు పోలీసులు. అవన్నీ వివిధ జిల్లాలో నమోదయ్యాయి. అలాగే 17 వేల మందిని అరెస్ట్ చేసి, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వాహనాలకు రూ.43 కోట్లు ఫైన్ వేశారు. ఇక ఏపీలో అత్యంత బిజీ సిటీ అయిన విజయవాడలో కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎక్కువ అరెస్టులు జరిగ్గా.. వెహికిల్స్‌కి ఎక్కువ ఫైన్.. అనంతపురం జిల్లాలో వేశారు.

Read More:

షాపుల ముందు మందు బాబుల క్యూ లైన్‌ చూసి షాక్‌ అయిన చంద్రబాబు!

పేగులపై కరోనా వైరస్ దాడి.. మళ్లీ ఇదో కొత్త టెన్షన్!

కొల్లాపూర్ కోటపై గెలుపు జెండా నాటేది ఎవరు..?
కొల్లాపూర్ కోటపై గెలుపు జెండా నాటేది ఎవరు..?
ఉదయం లేవగానే తలనొప్పి వేధిస్తుందా.? మీకు ఈ ప్రమాదం ఉన్నట్లే..
ఉదయం లేవగానే తలనొప్పి వేధిస్తుందా.? మీకు ఈ ప్రమాదం ఉన్నట్లే..
ప్రమాదం అంచున లీనింగ్‌ టవర్‌..ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు..
ప్రమాదం అంచున లీనింగ్‌ టవర్‌..ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు..
ఛార్జింగ్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? భారీ నష్టం తప్పదు
ఛార్జింగ్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? భారీ నష్టం తప్పదు
తగ్గేదేలే.. వేడుకలకు సిద్ధంగా ఉండండి. మంత్రి కేటీఆర్ ట్వీట్...
తగ్గేదేలే.. వేడుకలకు సిద్ధంగా ఉండండి. మంత్రి కేటీఆర్ ట్వీట్...
మీ శరీరంలో ఈ సమస్య ఉంటే పొరపాటున కూడా పాలు తాగకండి..ఆరోగ్యం మరింత
మీ శరీరంలో ఈ సమస్య ఉంటే పొరపాటున కూడా పాలు తాగకండి..ఆరోగ్యం మరింత
ఒత్తిడితో చిత్తవుతున్నారా.? చామంతి పూలతో ఇలా చేయండి..
ఒత్తిడితో చిత్తవుతున్నారా.? చామంతి పూలతో ఇలా చేయండి..
కరివేపాకుతో ఈ సమస్యలన్నీ దూరం.. ఇప్పటికైనా పరేయకుండా తినేయండి..
కరివేపాకుతో ఈ సమస్యలన్నీ దూరం.. ఇప్పటికైనా పరేయకుండా తినేయండి..
10 రకాల ఉప్పులు ఉన్నాయి.. మీ ఆరోగ్యానికి ఏది ఉత్తమమైనదో తెలుసా..?
10 రకాల ఉప్పులు ఉన్నాయి.. మీ ఆరోగ్యానికి ఏది ఉత్తమమైనదో తెలుసా..?
200 మెగాపిక్సెల్స్ కెమెరా, మరెన్నో స్టన్నింగ్‌ ఫీచర్స్‌..
200 మెగాపిక్సెల్స్ కెమెరా, మరెన్నో స్టన్నింగ్‌ ఫీచర్స్‌..