తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే.!
Corona update in Telangana: తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,24,066 నమూనాలను పరీక్షించగా 1,707మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు...
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,24,066 నమూనాలను పరీక్షించగా 1,707మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,00,318కి చేరింది. మరో 16 మంది మహమ్మారికి బలయ్యారు. మొత్తం మృతుల సంఖ్య 3,456కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,759 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. అటు నిన్న 2,493 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇప్పటిదాకా మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,74,163కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో గ్రేటర్ పరిధిలో 158, నల్గొండ 147, రంగారెడ్డి 96, మేడ్చల్ మల్కాజ్ గిరి 79, కరీంనగర్ 84, ఖమ్మం 127 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.