Covid 19: చైనాలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి.. అతి పెద్ద నగరాల్లో నేటి నుంచి కఠిన లాక్‌డౌన్!
రెండేళ్లలో ఎన్నడూ లేనంత భయంకరమైన కరోనాతో చైనా పోరాడుతోంది. సోమవారం, చైనా తన అతిపెద్ద నగరమైన షాంఘైలోని చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించింది.
China Coronavirus: రెండేళ్లలో ఎన్నడూ లేనంత భయంకరమైన కరోనా(Covid 19)తో చైనా(China) పోరాడుతోంది. సోమవారం, చైనా తన అతిపెద్ద నగరమైన షాంఘై(Shanghai)లోని చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్(Lock Down) విధించింది. దీంతో పాటు నగరంలో కరోనా పరీక్షలను పెద్ద ఎత్తున ప్రారంభించారు అధికారులు. పుడాంగ్ దాని పరిసర ప్రాంతాలలో సోమవారం నుండి శుక్రవారం వరకు లాక్‌డౌన్ విధించినట్లు స్థానిక ప్రభుత్వం తెలిపింది. చైనాకు ఆర్థిక రాజధాని షాంఘైలో లాక్‌డౌన్ రెండవ దశ నగరాన్ని విభజించే హువాంగ్‌పు నది పశ్చిమ ప్రాంతంలో శుక్రవారం నుండి ఐదు రోజులపాటు లాక్‌డౌన్ విధించి, కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.
లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశించారు. లాక్‌డైన్ సమయంలో అవసరమైన వ్యాపారాలు మినహా అన్ని వాణిజ్య సంస్థలు మూసివేయాలని సూచించారు. ప్రజా రవాణా కూడా మూసివేయడం జరుగుతుంది. షాంఘైలో భారీ కరోనా ఇన్వెస్టిగేషన్ ప్రచారం ప్రారంభమైంది. 2.60 కోట్ల జనాభా ఉన్న షాంఘై నగరంలోని అనేక ప్రాంతాలు ఇప్పటికే లాక్‌డౌన్‌లో ఉన్నాయి. అక్కడ ప్రజలకు నిరంతరం కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. గతంలో షాంఘైలోని డిస్నీ థీమ్ పార్క్ కూడా మూసివేశారు.
చైనాలో ఒక్క మార్చి నెలలోనే 56 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువ భాగం ఈశాన్య ప్రావిన్స్ జిలిన్‌లో వెలుగుచూసినట్లు అధికారులు తెలిపారు. అయితే షాంఘైలో ఇప్పటి వరకు అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. శనివారం ఇక్కడ 47 కేసులు మాత్రమే రికార్డ్ అయ్యాయి. అయితే ఇన్‌ఫెక్షన్ వేగంగా వ్యాపించడంతో, లాక్‌డౌన్ ద్వారా పరిస్థితిని వేగంగా నియంత్రించడానికి చైనా చర్యలు తీసుకుంది. గతంలో కూడా కోవిడ్-19ను చైనా త్వరగా నియంత్రించింది. ఆ దేశవ్యాప్తంగా ‘జీరో కోవిడ్ పాలసీ’ని అనుసరించారు. కాబట్టి కఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా అంటువ్యాధి వేగంగా నియంత్రించాలని అధికారులు చర్యల చేపట్టారు. ఇందుకోసం దూకుడు పద్ధతులను కూడా అవలంబిస్తోంది. జీరో కోవిడ్ విధానంలో, కమ్యూనిటీ స్థాయిలో సంక్రమణను నివారించడానికి చర్యలు తీసుకుంటారు.అవసరమైనప్పుడు కఠినమైన లాక్‌డౌన్ విధించ జరుగుతుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రభుత్వ ఉద్యోగులను కఠినంగా శిక్షిస్తామని చైనా సర్కార్ హెచ్చరికలు జారీ చేసింది.
Read Also…. Russia Ukraine War: అనేక నగర మేయర్లను కిడ్నాప్ చేసి హతమారుస్తున్నారు.. రష్యాపై జెలెన్‌స్కీ సంచలన ఆరోపణలు!