AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిబంధనలు ఉల్లంఘిస్తూ మంత్రి పుట్టిన రోజు వేడుకలు

ప్రజలకు నిబంధనలు పాటించడంటూ చెప్పాల్సిన మంత్రి.. అట్టహాసంగా వేడుకలు నిర్వహించారు. దీంతో సోషల్ డిస్టెన్స్‌ అన్న నిబంధన గాల్లో కలిసిపోయింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన....

నిబంధనలు ఉల్లంఘిస్తూ మంత్రి పుట్టిన రోజు వేడుకలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 23, 2020 | 9:00 PM

Share

ప్రజలకు నిబంధనలు పాటించడంటూ చెప్పాల్సిన మంత్రి.. అట్టహాసంగా వేడుకలు నిర్వహించారు. దీంతో సోషల్ డిస్టెన్స్‌ అన్న నిబంధన గాల్లో కలిసిపోయింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మంత్రి పుట్టిన రోజు వేడుకల్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి అమర్‌జీత్‌ భగత్‌ సోమవారం నాడు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన కుమారుడు ఈ కార్యక్రమాన్ని అంబికాపూర్‌లో నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రజలకు.. మాస్క్‌లను, బ్లాంకెట్‌లను పంపిణీ చేశాడు మంత్రి కుమారుడు. దీంతో అక్కడికి వచ్చిన ప్రజలు సోషల్ డిస్టెన్స్‌ అన్నది పాటించకుండా.. గుంపులు గుంపులుగా గుమికూడారు. ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరోవైపు మంత్రిగారు ఇలా వేడుకలు జరుపుకోవడంపై.. ప్రతిపక్ష నాయుకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మీడియాతో ముచ్చటించిన మంత్రి.. ప్రజలంతా సోషల్ డిస్టెన్స్‌ తప్పనిసరిగా పాటించాలని.. మాస్క్‌లు, శానిటైజర్‌లను వాడుతూ కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటూ సూచించారు.

Follow Us
ఇనుముతో తయారైన రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టవు..?
ఇనుముతో తయారైన రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టవు..?
ఏంటక్కా ఇలా తయారయ్యారు.. లవర్ కోసం ప్రియురాలు ఏం చేసిందంటే..
ఏంటక్కా ఇలా తయారయ్యారు.. లవర్ కోసం ప్రియురాలు ఏం చేసిందంటే..
సంజూ @ 26.. టీమిండియా విజయాన్ని అడ్డుకునే మొనగాడు ఉన్నాడా..?
సంజూ @ 26.. టీమిండియా విజయాన్ని అడ్డుకునే మొనగాడు ఉన్నాడా..?
ఆ చెత్త సినిమా ఎందుకు చేశారు సర్.! ఓపెన్‌గా అడిగేసిన బిచ్చగాడు..
ఆ చెత్త సినిమా ఎందుకు చేశారు సర్.! ఓపెన్‌గా అడిగేసిన బిచ్చగాడు..
ఆ రోజు పరిస్థితి దారుణం..షూటింగ్ టైంలో టీవీ పేలిపోయింది.
ఆ రోజు పరిస్థితి దారుణం..షూటింగ్ టైంలో టీవీ పేలిపోయింది.
దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన పవర్ఫుల్ ఉమెన్స్..
దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన పవర్ఫుల్ ఉమెన్స్..
సమ్మర్‌లో అదిరే బిజినెస్.. కేవలం 3 నెలలు కష్టపడితే రూ.3 లక్షల..
సమ్మర్‌లో అదిరే బిజినెస్.. కేవలం 3 నెలలు కష్టపడితే రూ.3 లక్షల..
IND vs NZ: ఒకే దెబ్బకు 3 భారీ ప్రపంచకప్ రికార్డులు.. అవేంటంటే?
IND vs NZ: ఒకే దెబ్బకు 3 భారీ ప్రపంచకప్ రికార్డులు.. అవేంటంటే?
నిమిషాల్లోనే మెదడు గడ్డలకు చికిత్స..దక్షిణ భారతంలోనే హైదరాబాద్‌లో
నిమిషాల్లోనే మెదడు గడ్డలకు చికిత్స..దక్షిణ భారతంలోనే హైదరాబాద్‌లో
బెడ్‌రూమ్‌ ఏసీ నుంచి అదే పనిగా శబ్ధాలు.. దగ్గరకు వెళ్లగా.. వామ్మో
బెడ్‌రూమ్‌ ఏసీ నుంచి అదే పనిగా శబ్ధాలు.. దగ్గరకు వెళ్లగా.. వామ్మో