పెరుగుతున్న కోవిడ్‌ కేసులతో కేంద్రం కీలక నిర్ణయం … ఆ కట్టడాల సందర్శనకు బ్రేక్‌

దేశ వ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం మరింత భయపెడుతోంది. దీంతో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారక స్థలాలు, మ్యూజియాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది.

పెరుగుతున్న కోవిడ్‌ కేసులతో కేంద్రం కీలక నిర్ణయం ... ఆ కట్టడాల సందర్శనకు బ్రేక్‌
తాజ్ మహల్..ఇండియాలో ఉన్న అత్యంత సుందరమైన ప్రాంతం. దీనిని క్రీ.పూ. 1631- 1648 మధ్య షాజహాన్ నిర్మించాడు.
Follow us

|

Updated on: Apr 16, 2021 | 12:21 AM

దేశ వ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం మరింత భయపెడుతోంది. దీంతో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారక స్థలాలు, మ్యూజియాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ సంరక్షణలో ఉండే స్మారక కట్టడాలు, స్థలాలు, మ్యూజియాలను మే 15వరకు మూసివేస్తున్నట్టు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

గతేడాది కరోనా తీవ్రరూపం దాల్చిన సందర్భంలో కూడా ఈ కట్టడాలన్నీ మూసివేయగా.. వైరస్‌ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టడంతో క్రమంగా ఆంక్షలు ఎత్తివేసిన విషయం తెలిసిందే. తాజాగా గతంలో కంటే వేగంగా కరోనా 2.0 కమ్ముకొస్తోంది. బుధవారం ఒక్కరోజే 2లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొవిడ్‌ను అదుపు చేసే చర్యల్లో భాగంగా మరోసారి కేంద్రం సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలను దశల వారీగా ప్రకటిస్తున్నాయి.

ఒక్కరోజే 2 లక్షలకు పైగా కేసులు, వేయి మరణాలు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. రోజువారి కేసుల సంఖ్య దాదాపు 10 రోజుల్లో రెట్టింపు అయ్యాయి. మరోవైపు రికవరీ రేటు కూడా పడిపోయింది. ఇప్పటికే మహారాష్ట్రలో పరిస్థితి తీవ్రంగా ఉండగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, ఢిల్లీల్లో మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: ED Pulls ESI Scam: జ్యువెలర్స్ షోరూమ్‌లో స్విచ్ వేస్తే.. తెలంగాణ కార్మిక శాఖ పేషీలో లైటు వెలిగింది.. ESI స్కామ్ లో థ్రిల్లర్‌ మూవీ క్లైమాక్స్

 Corona cases: గల్లీ నుంచి ఢిల్లీ వరకు హాట్ స్పాట్ సెంటర్లు.. తెలంగాణలోని ఆ జల్లాలో పెరుగుతున్న కరోనా విలయతాండవం..