కోవిడ్ వ్యాక్సిన్‌పై కేంద్రం కీలక ప్రకటన.. అప్పటి కల్లా సుమారు 30 కోట్ల మందికి.!
కోవిడ్ వ్యాక్సిన్‌తో పాటు ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తాజాగా మీడియాతో మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీలో నెలకొన్న..
ప్రపంచమంతా కరోనా వైరస్‌తో పోరాటం సాగిస్తోంది. ఇప్పటిదాకా ఈ మహమ్మారి ధాటికి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి విరుగుడు కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు రాత్రింబవళ్ళు కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయిల్స్ దశలో ఉండగా.. అవి వచ్చే ఏడాదికి అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కరోనా వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
కోవిడ్ వ్యాక్సిన్‌తో పాటు ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తాజాగా మీడియాతో మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులపై కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని.. కరోనా వ్యాప్తిని నియంత్రించే క్రమంలో కేజ్రివాల్ ప్రభుత్వానికి తమ సహాయసహకారాలు ఎలప్పుడూ ఉంటాయని ఆయన అన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా.. ఢిల్లీ ముఖ్యమంత్రి, గవర్నర్లతో మరోసారి భేటి అయ్యి.. కరోనా వ్యాప్తిని నియంత్రించే చర్యలపై చర్చించనున్నారని తెలిపారు.
మరోవైపు కోవిడ్ వ్యాక్సిన్ లభ్యతపై మాట్లాడిన మంత్రి.. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలోగా టీకా సిద్దమవుతుందన్న నమ్మకం ఉందన్నారు. గత రెండు, మూడు నెలలుగా ఫస్ట్ డోసులు ఎవరికి ఇవ్వాలన్న దానిపై ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు. 2021 జూన్-ఆగష్టు మధ్య సుమారు 25 నుంచి 30 కోట్ల మందికి వ్యాక్సిన్ డోసులను ఇచ్చేందుకు కావాల్సిన సదుపాయాలను సిద్దం చేస్తున్నామన్నారు. ఒక రోజులో కోట్ల మంది పిల్లలకు వ్యాక్సిన్ అందించేలా వ్యవస్థను రూపొందిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో కోవిడ్ వ్యాక్సిన్ల చివరి దశ ట్రయిల్స్ జరుగుతున్నాయి. వాటి ఫలితాలు కూడా వస్తున్నాయి. అలాగే భారత్‌లో అభివృద్ధి చెందుతున్న రెండు వ్యాక్సిన్లకు సంబంధించి క్లినికల్ ట్రయిల్స్ కూడా మూడవ దశకు చేరుకున్నాయి. 2021 నాటికి వ్యాక్సిన్ ప్రజల అందుబాటులోకి వ్యాక్సిన్ వస్తుందని మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కాగా, కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా కేంద్రం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా.. ఐసీఎంఆర్ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని వెల్లడించారు.
Also Read:
పింఛన్‌దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ పింఛన్‌ను రెండు విడతలుగా చెల్లించేందుకు.!
జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెల 25న వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ.!
#Adipurursh: ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ సర్‌ప్రైజ్.. రిలీజ్ డేట్ ఫిక్స్..