తెలంగాణ కరోనా: యాక్టివ్ కేసులు 12,682.. కోలుకున్నవారు 2,46,733..

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1058 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,60,834కి చేరింది.

తెలంగాణ కరోనా: యాక్టివ్ కేసులు 12,682.. కోలుకున్నవారు 2,46,733..
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 19, 2020 | 9:02 AM

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1058 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,60,834కి చేరింది. ఇందులో 12,682 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,46,733 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 1,440 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 4 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 1419కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 38,757 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 50,11,164కి చేరింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 58, జీహెచ్ఎంసీ 168, జగిత్యాల 36, జనగాం 16, జయశంకర్ భూపాలపల్లి 13, గద్వాల్ 2, కామారెడ్డి 18, కరీంనగర్ 53, ఖమ్మం 36, ఆసిఫాబాద్ 6, మహబూబ్ నగర్ 8, మహబూబాబాద్ 9, మంచిర్యాల 37, మెదక్ 17, మేడ్చల్ 93, ములుగు 15, నాగర్ కర్నూల్ 37, నల్గొండ 43, నారాయణపేట 7, నిర్మల్ 9, నిజామాబాద్ 16, పెద్దపల్లి 25, రాజన్న సిరిసిల్ల 30, రంగారెడ్డి 91, సంగారెడ్డి 47, సిద్ధిపేట 29, సూర్యాపేట 35, వికారాబాద్ 24, వనపర్తి 15, వరంగల్ రూరల్ 9, వరంగల్ అర్బన్ 35, యదాద్రి భువనగిరిలో 17 కేసులు నమోదయ్యాయి.

Also Read: 

పింఛన్‌దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ పింఛన్‌ను రెండు విడతలుగా చెల్లించేందుకు.!

జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెల 25న వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ.!

#Adipurursh: ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ సర్‌ప్రైజ్‌.. రిలీజ్ డేట్ ఫిక్స్..