AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీ సర్కార్ యాప్ ఛాలెంజ్.. రూ.15 లక్షలు గెలుచుకున్న ఏపీ విద్యార్థి..

కేంద్ర మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించిన వీడియో కాన్ఫ‌రెన్స్ సొల్యూష‌న్ ఛాలెంజ్‌లో ఎంపిక‌య్యాడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యార్థి. దీంతో ఏపీ స్టూడెంట్ వంశీ కుమార్‌కి జాతీయ స్థాయి గుర్తింపు ల‌భించింది. కాకినాడ‌కు చెందిన‌ వంశీ కుమార్.. అమెరిక‌న్ జూమ్ యాప్‌కు ప్ర‌త్యామ్నాయంగా లిబిరో అనే భార‌తీయ యాప్‌ను రూపొందించాడు వంశీ. ఇది స‌క్సెస్ కావ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం...

మోదీ సర్కార్ యాప్ ఛాలెంజ్.. రూ.15 లక్షలు గెలుచుకున్న ఏపీ విద్యార్థి..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 12, 2020 | 12:21 PM

Share

ప్ర‌స్తుతం దేశంలో ఉన్న పెద్ద కంపెనీల నుంచి అతి చిన్న కంపెనీలు సైతం జూమ్ యాప్‌ని వినియోగిస్తున్నాయి. అయితే అందులో స‌మావేశాలు నిర్వ‌హించ‌డం వ‌ల్ల స‌మాచారం లీక్ అవుతుందని ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో భార‌త్ వ‌ర్చువ‌ల్ యాప్ నిర్వ‌హించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కే వీడియో కాన్ఫ‌రెన్స్ సొల్యూష‌న్ ఛాలెంజ్‌ని ప్ర‌వేశ‌పెట్టింది. ఇందులో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన వారికి ప్రైజ్ మ‌నీ ఇస్తామ‌ని మోదీ స‌ర్కార్ ప్ర‌క‌టించింది.

ఈ నేప‌థ్యంలో కేంద్ర మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించిన వీడియో కాన్ఫ‌రెన్స్ సొల్యూష‌న్ ఛాలెంజ్‌లో ఎంపిక‌య్యాడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యార్థి. దీంతో ఏపీ స్టూడెంట్ వంశీ కుమార్‌కి జాతీయ స్థాయి గుర్తింపు ల‌భించింది. కాకినాడ‌కు చెందిన‌ వంశీ కుమార్.. అమెరిక‌న్ జూమ్ యాప్‌కు ప్ర‌త్యామ్నాయంగా ‘లిబిరో’ అనే భార‌తీయ యాప్‌ను రూపొందించాడు వంశీ. ఇది స‌క్సెస్ కావ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం నుంచి రూ.15 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీని కైవసం చేసుకున్నాడు. కాగా ఇత‌ను ఆదిత్య కాలేజీలో చ‌దువుకున్నాడు. ప్ర‌స్తుతం సోల్ఫీజ్ ఐటీ సొల్యూష‌న్‌లో సీటీఓగా వంశీ కుమార్‌ ప‌ని చేస్తున్నాడు. రెండు కంపెనీల‌కు ఇంజినీర్‌గా సేవ‌ల‌ను అందిస్తున్నాడు వంశీ. కాగా ఈ పోటీకి 12 కంపెనీలు పోటీ ప‌డ్డాయి. వీరిలో 25 మంది స‌భ్యులు జ్యూరీ ఫైన‌ల్‌కు ఎంపిక‌య్యారు. ఇందులో లిబిరో యాప్ 5వ స్థానంలో నిలిచింది.

కాగా భారత్, చైనా సరిహద్దుల్లో గత కొద్ది రోజుల నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. గాల్వాన్ లోయలో నెలకొన్న ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన 59 యాప్‌లను.. ఇండియా బ్యాన్ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో టెర్ర‌ర్ సృష్టిస్తోన్న కరోనా.. తీవ్రంగా కేసులు న‌మోదు..

ప్ర‌ముఖ న‌టి రేఖ బంగ్లాకి సీల్..

Follow Us
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి ఇంత ఫిట్‌గా ఎలా ఉంటారు? సీఎం ఆరోగ
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి ఇంత ఫిట్‌గా ఎలా ఉంటారు? సీఎం ఆరోగ
పరిచయం నుంచి నిశ్చితార్థం వరకు.. కట్‌చేస్తే, పోలీసుల రంగప్రవేశం
పరిచయం నుంచి నిశ్చితార్థం వరకు.. కట్‌చేస్తే, పోలీసుల రంగప్రవేశం
కోసిన బంగాళదుంపలు నల్లబడుతున్నాయా? తాజాగా ఉండాలంటే ఇలా చేయండి..!
కోసిన బంగాళదుంపలు నల్లబడుతున్నాయా? తాజాగా ఉండాలంటే ఇలా చేయండి..!
లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకీ మామ..లుక్ అద్దిరిపోయింది
లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకీ మామ..లుక్ అద్దిరిపోయింది
అప్పుల బాధలో పుట్టిన అద్భుతం.. సేఫ్టీ పిన్ కథ మామూలుగా లేదుగా..
అప్పుల బాధలో పుట్టిన అద్భుతం.. సేఫ్టీ పిన్ కథ మామూలుగా లేదుగా..
పాత బావిలో విషవాయువు.. నలుగురు మృతి
పాత బావిలో విషవాయువు.. నలుగురు మృతి
ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బాండెడ్‌ క్రేట్‌
ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బాండెడ్‌ క్రేట్‌
బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందా..! 2030 నాటికి బంగారం ధర..
బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందా..! 2030 నాటికి బంగారం ధర..
హీరో, హోండా ఎందుకు విడిపోయాయి? 26 ఏళ్ల అనుబంధం వెనుక ఇంత కథ ఉందా?
హీరో, హోండా ఎందుకు విడిపోయాయి? 26 ఏళ్ల అనుబంధం వెనుక ఇంత కథ ఉందా?
పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!
పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!