AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిలకడగా అమితాబ్ ఆరోగ్యం…నానావతి ఆసుపత్రి వర్గాలు

కరోనా వైరస్ కి గురైన బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, స్వల్ప పాజిటివ్ లక్షణాలు మాత్రమే కనిపించాయని ముంబైలో ఆయన చికిత్స పొందుతున్న నానావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అమితాబ్ తో బాటు..

నిలకడగా అమితాబ్ ఆరోగ్యం...నానావతి ఆసుపత్రి వర్గాలు
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 12, 2020 | 11:45 AM

Share

కరోనా వైరస్ కి గురైన బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, స్వల్ప పాజిటివ్ లక్షణాలు మాత్రమే కనిపించాయని ముంబైలో ఆయన చికిత్స పొందుతున్న నానావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అమితాబ్ తో బాటు ఆయన కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్  శనివారం సాయంత్రం ఈ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. తన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు ట్విటర్ ద్వారా తన అభిమానులకు తెలియజేస్తుంటానని అమితాబ్ పేర్కొన్నారు. కాగా వీరి ఆరోగ్యంపై ఈ హాస్పిటల్ డాక్టర్ అబ్దుల్ సమర్ అన్సారీ వివరిస్తూ.. వీరి హెల్త్ ని జాగ్రత్తగా పరిరక్షించే బృహత్తర బాధ్యత తమపై ఉందని చెప్పారు. అమితాబ్, అభిషేక్ బచ్చన్  ఆరోగ్యం నిలకడగా ఉందని, స్వల్ప పాజిటివ్ లక్షణాలు ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన పని లేదని ఆయన చెప్పారు. సాధారణంగా 10 నుంచి 12 రోజుల్లో శరీరంపై వ్యాధి ప్రభావం కనిపిస్తుందని, అమితాబ్ కి ఈ లక్షణాలు సోకి నేటికి 5 వ రోజయిందని ఆయన అన్నారు. మరో ఏడు రోజులు జాగరూకతతో పరిశీలించాల్సి ఉందన్నారు. మరి మూడు రోజుల్లో అమితాబ్ ‘ఎవల్యూషన్ ట్రాజెక్టరీ’..(వ్యాధి తదనంతర పరిణామాలు) ని గమనించగలుగుతామని డాక్టర్ అబ్దుల్ సమర్ పేర్కొన్నారు. కాగా-బచ్ఛన్ ఫ్యామిలీలోని ఇతర కుటుంబ సభ్యులందరికీ కరోనా నెగెటివ్ అని వార్తలు వచ్చాయి.

స్పిరిట్ మూవీ నుంచి ప్రకాష్ రాజ్ అవుట్.. రియాక్షన్ ఇదే..
స్పిరిట్ మూవీ నుంచి ప్రకాష్ రాజ్ అవుట్.. రియాక్షన్ ఇదే..
పైకి చూస్తే మొక్కజొన్న చేను.. లోపల కథ వేరే..
పైకి చూస్తే మొక్కజొన్న చేను.. లోపల కథ వేరే..
డబ్బు విషయంలో ఈ తప్పులు చేస్తే కష్టాలు తప్పవు..! చాణక్యుడి టిప్స్
డబ్బు విషయంలో ఈ తప్పులు చేస్తే కష్టాలు తప్పవు..! చాణక్యుడి టిప్స్
గోంగూర రొయ్యల ఇగురు.. ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే!
గోంగూర రొయ్యల ఇగురు.. ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే!
పెళ్లికని దుబాయ్‌ వెళ్లితే రూ.1200000 బంగారం చెత్తలో పోయింది!
పెళ్లికని దుబాయ్‌ వెళ్లితే రూ.1200000 బంగారం చెత్తలో పోయింది!
. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..
. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..
ఉద్యోగులకు మోదీ సర్కార్ హోలీ ధమాకా.. మార్చిలో అకౌంట్లోకి భారీగా..
ఉద్యోగులకు మోదీ సర్కార్ హోలీ ధమాకా.. మార్చిలో అకౌంట్లోకి భారీగా..
31 ఫోర్లు, 6 సిక్సర్లతో అద్భుతం... ఆ ఒక్క పరుగుతో చెత్త రికార్డ్
31 ఫోర్లు, 6 సిక్సర్లతో అద్భుతం... ఆ ఒక్క పరుగుతో చెత్త రికార్డ్
ఈ రంగు గోర్లున్నవారంతా అదృష్టవంతులే..! మరి తెలుపు రంగు ఉంటే..?
ఈ రంగు గోర్లున్నవారంతా అదృష్టవంతులే..! మరి తెలుపు రంగు ఉంటే..?
టాలీవుడ్​లో కొత్త హీరోయిన్ల హవా.. త్రిప్తీ నుంచి రషా తడాని వరకు!
టాలీవుడ్​లో కొత్త హీరోయిన్ల హవా.. త్రిప్తీ నుంచి రషా తడాని వరకు!