కరోనా కాలంలో లాక్‌డౌన్ ప్యాకేజి నిధులను విడుదల చేసిన కేంద్రం..

దేశమంతా కరోనా కల్లోలంతో విలవిలలాడుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్యాకేజీ నిధులను విడుదల చేసి కాస్త ఊరటను ఇచ్చింది. వీటి ద్వారా 33 కోట్ల మందికి పైగా ప్రత్యక్ష ఆర్థిక సహాయం లభించనుంది.

కరోనా కాలంలో లాక్‌డౌన్ ప్యాకేజి నిధులను విడుదల చేసిన కేంద్రం..
Follow us

|

Updated on: Apr 23, 2020 | 1:59 PM

దేశమంతా కరోనా కల్లోలంతో విలవిలలాడుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్యాకేజీ నిధులను విడుదల చేసి కాస్త ఊరటను ఇచ్చింది. వీటి ద్వారా 33 కోట్ల మందికి పైగా ప్రత్యక్ష ఆర్థిక సహాయం లభించనుంది. ప్యాకేజి నిధుల కేటాయింపులో భాగంగా ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పధకం కింద రూ. 31,235 కోట్లు, 20 కోట్ల మహిళా జన్‌ధన్ ఖాతాల్లోకి రూ. 10,025 కోట్లు, 2.82 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పెన్షన్ కోసం రూ. 1,405 కోట్లు, పీఎం-కిసాన్ యోజన కింద 8 కోట్ల మంది రైతులకు రూ. 16,146 కోట్లు, 68,775 కంపెనీల్లో పనిచేసే 10.6 లక్షల ఉద్యోగులకు ఈపీఎఫ్ వాటాగా రూ.162 కోట్లను కేంద్రం కేటాయించింది. కాగా, దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ఇప్పటివరకు 21 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. సుమారు 600 పైగా మరణాలు సంభవించాయి.

Also Read:

కిమ్ కంటే యమ డేంజరట.. ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

జూన్ 1 వరకూ లాక్‌డౌన్‌.. సర్కార్ కీలక నిర్ణయం..

కరోనా వేళ.. పాక్‌కు గట్టి షాక్.. క్వారంటైన్‌కు ఇమ్రాన్ ఖాన్.!

డిగ్రీ విద్యార్ధులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..

లాక్ డౌన్ వేళ.. అదిరిపోయే పబ్జీ కాంపిటీషన్.. ప్రో-ప్లేయర్స్ గెట్ రెడీ..

లాక్‌డౌన్‌ ఉల్లంఘించి పార్టీ చేసుకున్న గ్రామ వాలంటీర్లు..

గవర్నమెంట్ ఉద్యోగులకు జీతం కట్.. సీఎం కీలక నిర్ణయం..

కరోనాపై పోరు.. ప్లాస్మా థెరపీతో మరో ప్రయోగం..

గుడ్ న్యూస్.. కరోనా వ్యాక్సిన్ తయారీలో మరో ముందడుగు..