కరోనా వేళ.. పాక్‌కు గట్టి షాక్.. క్వారంటైన్‌కు ఇమ్రాన్ ఖాన్.!

కరోనా వైరస్‌కు పేదోడు, పెద్దోడు అనే తేడాలో లేదు. ప్రపంచంలో ఉన్న అందరిని కూడా గజగజలాడిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి దేశ రాణులు, ప్రధానులు, మంత్రులకు సోకి ఆసుపత్రి పాలు చేసిన సంగతి తెలిసిందే. మరొకొందరు అయితే క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు కరోనా టెన్షన్ పట్టుకుంది. ఇటీవల ఆయన ఓ కరోనా పేషెంట్‌ను కలవడంతో వైద్యులు ఆయన్ని ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ ప్రముఖ స్వచ్ఛందసేవా సంస్థ […]

కరోనా వేళ.. పాక్‌కు గట్టి షాక్.. క్వారంటైన్‌కు ఇమ్రాన్ ఖాన్.!
Follow us

|

Updated on: Apr 22, 2020 | 8:55 AM

కరోనా వైరస్‌కు పేదోడు, పెద్దోడు అనే తేడాలో లేదు. ప్రపంచంలో ఉన్న అందరిని కూడా గజగజలాడిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి దేశ రాణులు, ప్రధానులు, మంత్రులకు సోకి ఆసుపత్రి పాలు చేసిన సంగతి తెలిసిందే. మరొకొందరు అయితే క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు కరోనా టెన్షన్ పట్టుకుంది. ఇటీవల ఆయన ఓ కరోనా పేషెంట్‌ను కలవడంతో వైద్యులు ఆయన్ని ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు.

వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ ప్రముఖ స్వచ్ఛందసేవా సంస్థ ‘ఈదీ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు ఫైసల్ ఈదీ.. ఇమ్రాన్‌ ఖాన్‌ను కలిసి కరోనా వైరస్ రిలీఫ్ ఫండ్‌కు పది మిలియన్ల చెక్‌ను అందజేశారు. ఇక ఆ తర్వాత ఈదీకి కరోనా వైరస్ సోకినట్లు తెలిసింది. అంతేకాక ఆయన కుటుంబసభ్యులు, ఫౌండేషన్‌లో పని చేస్తున్న పలువురు ఉద్యోగులకు కూడా కరోనా సోకినట్లు తేలింది. దీనితో ఇమ్రాన్ ఖాన్‌కు కరోనా పరీక్షలు నిర్వహిస్తారని.. త్వరలోనే క్వారంటైన్‌కు వెళ్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఒకవేళ ఇమ్రాన్ క్వారంటైన్‌కు వెళ్తే.. అక్కడి నుంచి ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తాదన్నది వేచి చూడాలి.

Also Read: 

కరోనా కాలంలో జగన్ మరో కీలక నిర్ణయం..

గుడ్ న్యూస్.. ఫలించిన ప్లాస్మా థెరపీ.. కోలుకున్న కరోనా బాధితుడు..

మందుబాబులకు గుడ్ న్యూస్.. తెరుచుకోనున్న మద్యం షాపులు.. కానీ..