బీజేపీ ఎమ్మెల్యే భార్యకు కొవిడ్ పాజిటివ్
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తోంది. ఇప్పడికే అక్కడి ప్రజాప్రతినిధులతోపాటు కరోనాపై ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్న పోలీసులు కరోనాకు చిక్కుతున్నారు.
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తోంది. ఇప్పటికే అక్కడి ప్రజాప్రతినిధులతోపాటు కరోనాపై ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్న పోలీసులు కరోనాకు చిక్కుతున్నారు. తాజాగా.. పూణే నగర పరిధి పింప్రి చించ్‌వాద్ బీజేపీ ఎమ్మెల్యే భార్యకు కరోనా సోకింది. దీంతో ఎమ్మెల్యే భార్యను చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వారి కటుంబ సభ్యులతోపాటు వారి ఇంట్లో పనిచేస్తున్న సిబ్బందికి కొవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముందస్తుగా వారిని క్వారంటైన్ చేశామని పింప్రి చించ్ వాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఇటీవల ప్రతిపక్షనాయకుడైన మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పింప్రి చించ్ వాద్ పర్యటనలో ఎమ్మెల్యే వెంట ఉన్నారు. ఒక్క పూణే జిల్లాలోనే మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,237కు పెరిగిందని, 721 మంది మరణించారని పూణే డివిజనల్ కమిషనర్ దీపక్ చెప్పారు.