EMIలపై గందరగోళం.. జనాల్లో అయోమయం ఈఎంఐలు చెల్లించాలా? వద్దా?

| Edited By:

Mar 31, 2020 | 5:02 PM

ఈఎంఐలను చెల్లించే మధ్య తరగతి వర్గాల్లో అయోమయం నెలకొంది. ఇప్పటివరకూ ఎస్‌బీఐ,హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, కోటక్, యాక్సిస్ వంటి పెద్ద బ్యాంకులు.. కస్టమర్లు తమ ఆప్షన్‌ను ఎంచుకోవడానికి ఏ ఛానెల్‌నూ యాక్టివేట్ చేయలేదు. దీంతో వినియోగదారుల్లో గందర గోళం...

EMIలపై గందరగోళం.. జనాల్లో అయోమయం ఈఎంఐలు చెల్లించాలా? వద్దా?
Follow us on

ఆర్థిక సంవత్సరం పొడిగింపు ప్రసక్తే లేదని.. ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ఇటీవల ప్రకటించారు. అయితే ఆర్బీఐ మాత్రం తన కీలక ప్రకటనలో ఈఎంఐలను మూడు నెలల పాటు చెల్లించనక్కరలేదని, రుణాలపై మూడు నెలల మారటోరియం విధిస్తున్నట్లు తాజాగా స్పష్టం చేసింది. ఈ నిబంధన అటు కమర్షియల్, రీజనల్, రూరల్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు వర్తిస్తుంది. అంటే మారిటోరియం కాలంలో మీ వేతనం నుంచి ఈఎంఐ పేరిట నెలసరి వాయిదా కట్ కాదు. అలాగే రెపో రేటు 75 బేసిస్ పాయింట్ల తగ్గింపు, నగదు నిల్వల నిష్పత్తి వంద బేసిస్ పాయింట్లు తగ్గింపు వంటి ముఖ్య నిర్ణయాలను ప్రకటించింది.

అయితే ముఖ్యంగా ఈఎంఐలను చెల్లించే మధ్య తరగతి వర్గాల్లో అయోమయం నెలకొంది. ఇప్పటివరకూ ఎస్‌బీఐ,హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, కోటక్, యాక్సిస్ వంటి పెద్ద బ్యాంకులు.. కస్టమర్లు తమ ఆప్షన్‌ను ఎంచుకోవడానికి ఏ ఛానెల్‌నూ యాక్టివేట్ చేయలేదు. దీంతో వినియోగదారుల్లో గందర గోళం నెలకొంది. ఇందుకు కారణం మీ ఖాతాలనుంచి ఈఎంఐలు డెబిట్ అవుతాయని, బ్యాంకుల్లో బ్యాలెన్స్ ఉంచాలని మెసేజ్‌లు రావడమే. నిజానికి ఏప్రిల్ 1వ తేదీ బుధవారం నుంచి వినియోగ దారులు, తమ నెలవారీ వాయిదాలను చెల్లించాల్సి ఉంది. అయితే రిజర్వు బ్యాంకు ప్రవేశ పెట్టిన ప్రత్యేక సౌకర్యాన్ని అమలు చేయడానికి బ్యాంకులు ఇంకా సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. కానీ ఒకవేళ ఈఎంఐల చెల్లింపులను వాయిదా వేసినట్టు అధికారికంగా ప్రకటన వచ్చిన పక్షంలో కస్టమర్లకు ఫోన్‌ల ద్వారా, మెయిల్స్ ద్వారా మెసేజ్‌లు వస్తాయని ఓ ప్రతినిధి చెప్పడమే ఆశా కిరణం. ఇప్పటి వరకూ చాలా బ్యాంకులకు అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడమే ఈ పరిస్థితికి దారితీస్తోంది.

ఇవి కూడా చదవండి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్

సల్మాన్ కుటుంబంలో తీవ్ర విషాదం..

అభిమానులకు కాదు.. జనరల్ ఆడియన్స్‌కి రీచ్ అయితే నేను హ్యాపీ

వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయంగా ‘బ్యాగ్ వాల్వ్ మాస్క్’

వాట్సాప్ నుంచే ఐసిఐసిఐ బ్యాంకు సేవలు

ఆల్కహాల్ బ్యాన్.. పెరుగుతోన్న మరో భయంకర వ్యాధి.. 8 మంది మృతి

ప్రభుత్వం వద్దంటోంది.. EMI వాడేమో కట్టాలంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు

లాక్‌డౌన్: దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన పీఎం మోదీ

డేంజరస్ వైరస్: కోలుకున్న తర్వాత కూడా 8 రోజులు శరీరంలోనే

కరోనా వైరస్ సోకితే.. ఏ రోజు ఏయే లక్షణాలు కనిపిస్తాయంటే? మీకోసమే!