India Corona Cases: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. వైరస్‌కు మరో 277మంది బలి

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. అయితే రోజువారి కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. అయితే మరణాల సంఖ్య పెరిగింది.

India Corona Cases: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. వైరస్‌కు మరో 277మంది బలి
Coronavirus
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 11, 2022 | 10:33 AM

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. అయితే రోజువారి కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది.  సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 1,68,063 మంది వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలింది. కరోనా వల్ల మరో 277మంది ప్రాణాలు విడిచారు. మరో 69,959 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. కాగా దేశంలో కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 10.64 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది

  • దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు: 3,58,75,790
  • దేశంలో మొత్తం మరణాలు: 4,84,213
  • దేశంలో ప్రజంట్ యాక్టివ్ కేసులు: 7,23,619
  • మొత్తం వైరస్ నుంచి కోలుకున్నవారు: 3,45,70,131

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు బూస్టర్ డోస్ ఇస్తున్నారు.  సోమవారం ఒక్కరోజే 92,07,700 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,52,89,70,294కు చేరింది.  దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో 4,461 ఒమిక్రాన్ కేసులు గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే ఒమిక్రాన్ అంత ప్రమాదకారి కానప్పటికీ.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని.. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read: Telangana: బైక్​పై ట్రిపుల్ రైడ్.. ఆపిన ఎస్సై.. బయటపడ్డ వివాహేతర సంబంధం, హత్య