Telangana: బైక్​పై ట్రిపుల్ రైడ్.. ఆపిన ఎస్సై.. బయటపడ్డ వివాహేతర సంబంధం, హత్య

అక్రమ సంబంధం లేదా వివాహేతర సంబంధం.. ఇప్పుడు ప్రతి క్రైమ్ వెనుక ఇదే కహాని ఉంటుంది. ఆత్మహత్యలు చేసుకోవడం లేదా హత్యలకు చేయడం వరకు తీసుకెళ్తున్నాయి ఈ సంబంధాలు.

Telangana: బైక్​పై ట్రిపుల్ రైడ్.. ఆపిన ఎస్సై.. బయటపడ్డ వివాహేతర సంబంధం, హత్య
Murder
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 11, 2022 | 9:10 AM

అక్రమ సంబంధం లేదా వివాహేతర సంబంధం.. ఇప్పుడు ప్రతి క్రైమ్ వెనుక ఇదే కహాని ఉంటుంది. ఆత్మహత్యలు చేసుకోవడం లేదా హత్యలకు చేయడం వరకు తీసుకెళ్తున్నాయి ఈ సంబంధాలు. తాజాగా వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో  కలిసి అతడిని ఖతం చేసింది ఓ మహిళ. అయితే సినీ ఫక్కీలో నిందితులు పోలీసులకు దొరికిపోయారు.  ఆదివారం అర్ధరాత్రి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఈ మర్డర్ జరిగింది.

వివరాల్లోకి వెళ్తే..  హన్వాడ మండలం పెద్దదర్పల్లికి చెందిన మొద్దు వెంకటయ్య(30)… ఇదే మండలం బుద్దారం గ్రామానికి చెందిన మాధవిని పెళ్లి చేసుకుని ఇల్లరికం వచ్చారు. కొంతకాలం క్రితం మాధవి హైదరాబాద్‌కు వలస వచ్చింది. ఆ సమయంలో నాగర్‌కర్నూల్‌కు చెందిన జంగం రమేశ్‌తో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. తిరిగి బుద్దారం వెళ్లిన తర్వాత కూడా మాధవి ప్రియుడితో ఈ బంధం కొనసాగించింది. అయితే భర్తతో ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన మాధవి ప్రియుడితో కలిసి వెంకటయ్యను చంపేయాలని డిసైడయ్యింది. ఇందుకు పక్కాగా స్కెచ్ గీశారు. ఆదివారం వెంకటయ్య ఇంట్లో పడుకున్న విషయాన్ని మాధవి, రమేశ్‌కు ఫోన్ చేసి చెప్పింది. అతడు తన మిత్రుడు కుర్మయ్యతో కలిసి బైక్ పై రాత్రి 11 గంటల ప్రాంతంలో బుద్దారానికి వచ్చాడు. అందరూ కలిసి వెంకటయ్య గొంతుకు చున్నీ బిగించి చంపేశారు. మద్యం తాగి రోడ్డుపై పడి చనిపోయాడని నమ్మించాలని స్కెచ్ గీశారు.

రమేశ్‌, కుర్మయ్యలు బైక్ పై తమ మధ్య వెంకటయ్య మృతదేహాన్ని కూర్చోబెట్టుకుని బయలుదేరారు. ఇదే సమయంలో మహ్మదాబాద్‌ ఎస్సై రవిప్రకాశ్‌, తన టీమ్ తో కలిసి జిల్లా కేంద్రం నుంచి వాహనంలో వెళుతున్నారు. ఎస్సైకి.. వీరిపై అనుమానం వచ్చి వారిని ఆపి ప్రశ్నించగా.. వెంకటయ్య తాగి ఉండడంతో ఇంటికి తీసుకెళుతున్నామని తప్పించుకోబోయారు. ఎస్సై గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పేశారు. నిందితులను హన్వాడ పోలీసులకు అప్పగించారు.

Also Read: Nalgonda District: మైసమ్మ గుడి ముందు మనిషి తల కేసులో పోలీసుల పురోగతి

పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
'అభివృద్ధికి విద్య తప్పనిసరి.. అందుకు భారత్ కేంద్రంగా మారాలి' RSS
'అభివృద్ధికి విద్య తప్పనిసరి.. అందుకు భారత్ కేంద్రంగా మారాలి' RSS
ఆస్కార్ కోసం రాజమౌళిని ఫాలో అవుతున్న ఆమిర్
ఆస్కార్ కోసం రాజమౌళిని ఫాలో అవుతున్న ఆమిర్
బెయిల్‌పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
బెయిల్‌పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
BSNL శబరిమలలో 48 ప్రదేశాలలో Wi-Fi.. ఫోన్‌లో ఎలా కనెక్ట్ చేయాలి?
BSNL శబరిమలలో 48 ప్రదేశాలలో Wi-Fi.. ఫోన్‌లో ఎలా కనెక్ట్ చేయాలి?
యాంకర్లుగా బిజీ అవుతున్న హీరోలు.. తగ్గేదేలే..
యాంకర్లుగా బిజీ అవుతున్న హీరోలు.. తగ్గేదేలే..
పాన్ ఇండియా ట్రెండ్‌లో సినిమాలు.. వెండితెర మీద ఊహాలోకాలు..
పాన్ ఇండియా ట్రెండ్‌లో సినిమాలు.. వెండితెర మీద ఊహాలోకాలు..
ఆలయాల చుట్టూ అఘోరీ మాత.. ఆమె ప్రదక్షిణల వెనుక పరమార్థం ఏమిటి?
ఆలయాల చుట్టూ అఘోరీ మాత.. ఆమె ప్రదక్షిణల వెనుక పరమార్థం ఏమిటి?