AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో కొత్త వైరస్ కలకలం.. 15,000 పందులు మృతి..

ఒకవైపు కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తుంటే.. మరోవైపు ఇంకో కొత్త వైరస్ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దేశంలోని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మరో ఫ్లూను అధికారులు గుర్తించారు. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌గా పిలవబడే ఈ వైరస్ వల్ల ఇప్పటికే అస్సాంలో దాదాపు 15 వేల పందులు మృత్యువాతపడ్డాయి. దీనిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఆ వైరస్ మరిన్ని ప్రాంతాలకు వ్యాప్తి చెందుతోంది. దీనితో ఆక్కడి ప్రభుత్వం వ్యాధి మరింతగా వ్యాప్తి […]

దేశంలో కొత్త వైరస్ కలకలం.. 15,000 పందులు మృతి..
Ravi Kiran
|

Updated on: May 15, 2020 | 6:02 PM

Share

ఒకవైపు కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తుంటే.. మరోవైపు ఇంకో కొత్త వైరస్ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దేశంలోని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మరో ఫ్లూను అధికారులు గుర్తించారు. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌గా పిలవబడే ఈ వైరస్ వల్ల ఇప్పటికే అస్సాంలో దాదాపు 15 వేల పందులు మృత్యువాతపడ్డాయి. దీనిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఆ వైరస్ మరిన్ని ప్రాంతాలకు వ్యాప్తి చెందుతోంది. దీనితో ఆక్కడి ప్రభుత్వం వ్యాధి మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండేలా పందులను సామూహికంగా చంపేందుకు సిద్ధమవుతోంది. అది కూడా కేవలం వైరస్ సోకిన వాటినే చంపాలని నిర్ణయించింది.  ఈ నేపధ్యంలోనే సుమారు పది జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసింది. అటు పందుల పెంపకం చేసే రైతులకు 144 కోట్ల రూపాయల వన్ టైమ్ ఫైనాన్షియల్ ప్యాకేజీని అందించాలని కేంద్రాన్ని కోరింది.

Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం

రాష్ట్రంలో పెరుగుతోన్న ఈ సంక్షోభం తీవ్ర ఆందోళనను కలగజేస్తోంది. రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఈ వైరస్ 10 జిల్లాలకు వ్యాపించింది. దాదాపు 14,919 పందులు చనిపోయాయి. తాము ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశామని ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి అతుల్ బోరా చెప్పారు. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ దేశీయ పందులకు ప్రాణాంతకం, దాదాపు 100 శాతం మరణాల రేటు ఉంటుంది. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా వ్యాపించింది. ఈ వ్యాధి జంతువుల నుండి జంతువులకే వ్యాపిస్తుందని.. మనుషులకు వ్యాప్తి చెందదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఈ వ్యాధి భారత్‌లో వ్యాపించడం తొలిసారి కాగా.. చైనా నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు అస్సాం మంత్రి పేర్కొన్నారు.

Read This: కిమ్ మరో సంచలనం.. ఈసారి వారిపై రహస్య నిఘా!

Follow Us
ఆరుగురు పతివ్రతలు తర్వాత సినిమాలు అందుకే చేయలేదు..
ఆరుగురు పతివ్రతలు తర్వాత సినిమాలు అందుకే చేయలేదు..
చికెన్ లేకపోతే ఏంటి? ఈ 5 ఫుడ్స్ ప్రోటీన్‌కు బెస్ట్ ఆప్షన్స్
చికెన్ లేకపోతే ఏంటి? ఈ 5 ఫుడ్స్ ప్రోటీన్‌కు బెస్ట్ ఆప్షన్స్
కామద ఏకాదశి.. ఈ వస్తువులు దానం చేశారంటే.. సంపద, ఐశ్వర్యం మీ వెంట
కామద ఏకాదశి.. ఈ వస్తువులు దానం చేశారంటే.. సంపద, ఐశ్వర్యం మీ వెంట
భక్తితో అగ్గిపెట్టెపై రామాయణాన్ని చిత్రీకరించిన కళాకారుడు!
భక్తితో అగ్గిపెట్టెపై రామాయణాన్ని చిత్రీకరించిన కళాకారుడు!
ఆ దేశాన్ని మింగేస్తున్న సముద్రం.. 30 ఏళ్లలో మ్యాప్ నుంచే మాయం..
ఆ దేశాన్ని మింగేస్తున్న సముద్రం.. 30 ఏళ్లలో మ్యాప్ నుంచే మాయం..
అప్పుడే ఓటీటీలోకి 'ఉస్తాద్ భగత్ సింగ్'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అప్పుడే ఓటీటీలోకి 'ఉస్తాద్ భగత్ సింగ్'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కాశ్మీర్‌ కాదు మన అరకు.. పరవశించిపోయిన పర్యాటకులు.. ఇదిగో వీడియో
కాశ్మీర్‌ కాదు మన అరకు.. పరవశించిపోయిన పర్యాటకులు.. ఇదిగో వీడియో
శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమె..
శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమె..
పెట్రోల్‌పై పన్ను ఎలా విధిస్తారు..? ఎన్ని రకాలుగా ఉంటుంది..?
పెట్రోల్‌పై పన్ను ఎలా విధిస్తారు..? ఎన్ని రకాలుగా ఉంటుంది..?
ప్రకృతినే శాసించ గల శక్తి .. హనుమంతుడికి ఇచ్చింది ఎవరో తెలుసా?
ప్రకృతినే శాసించ గల శక్తి .. హనుమంతుడికి ఇచ్చింది ఎవరో తెలుసా?