ఆరోగ్య సేతు’కు పోటీ.. యాపిల్, గూగుల్ నుంచి  కూడా.. ‘కరోనా’ ట్రాకింగ్ టూల్ ‘!

భారత ఆ'రోగ్యసేతు' యాప్ కి పోటీగానా అన్నట్టు యాపిల్, గూగుల్ కూడా కరోనా వైరస్ ట్రాకింగ్ టూల్ ని లాంచ్ చేశాయి. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు, 22 దేశాలు ఈ సాఫ్ట్ వేర్ ని ఉపయోగిస్తున్నాయని ఈ సంస్థలు తెలిపాయి.

ఆరోగ్య సేతు'కు పోటీ.. యాపిల్, గూగుల్ నుంచి  కూడా.. 'కరోనా' ట్రాకింగ్ టూల్ '!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 21, 2020 | 3:49 PM

భారత ఆ’రోగ్యసేతు’ యాప్ కి పోటీగానా అన్నట్టు యాపిల్, గూగుల్ కూడా కరోనా వైరస్ ట్రాకింగ్ టూల్ ని లాంచ్ చేశాయి. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు, 22 దేశాలు ఈ సాఫ్ట్ వేర్ ని ఉపయోగిస్తున్నాయని ఈ సంస్థలు తెలిపాయి. అయితే ఎన్ని ప్రభుత్వ ఏజెన్సీలు వినియోగిస్తున్నాయో తెలియజేసేందుకు నిరాకరించాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజారోగ్య శాఖలు ఉపయోగించుకోవడానికి అనువైన సాఫ్ట్ వేర్ ని లాంచ్ చేశామని, ఈ మొబైల్ యాప్ లు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించడానికి తోడ్పడతాయని ఈ సంస్థలు పేర్కొన్నాయి. స్మార్ట్ ఫోన్లలో బ్లూ టూత్ రేడియోస్ ని వినియోగించే ఎక్స్ పోజివ్ నోటిఫికేషన్ తమదని  యాపిల్, గూగుల్ ప్రకటించుకున్నాయి. ఇది అత్యంత ఆధునిక సాఫ్ట్ వేర్ అని, ఈ లేటెస్ట్ సాఫ్ట్ వేర్ తో తమ ఫోన్లను ‘అప్ డేట్’ చేసుకున్నవారు బ్లూ టూత్ సిగ్నల్ ని షేర్ చేసుకోగలుగుతారని ఈ సంస్థలు వివరించాయి. యాపిల్ లోని యాప్ స్టోర్ లో గానీ, గూగుల్ లోని ప్లే స్టోర్ లో గానీ ఈ  యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చునట.