తెలంగాణలో కొత్త ట్రాఫిక్ రూల్స్.. బ్రేక్ చేస్తే బాదుడే.!

లాక్ డౌన్ ముగుస్తోంది. కరోనా నేపధ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలు మళ్లీ తమ రొటీన్ లైఫ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ సమయంలో పోలీసులు కొత్త రూల్స్‌తో ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌ కఠినంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన దగ్గర నుంచి రూల్స్ అతిక్రమించేవారి కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనలను అమలు చేస్తున్నారు. ఇక బైక్ నడిపేవారు, వెనుక కూర్చున్న వారు ఖచ్చితంగా హెల్మెట్లు పెట్టుకోవాల్సిందే. లేదంటే భారీ ఫైన్ […]

  • Ravi Kiran
  • Publish Date - 3:29 pm, Thu, 21 May 20
తెలంగాణలో కొత్త ట్రాఫిక్ రూల్స్.. బ్రేక్ చేస్తే బాదుడే.!

లాక్ డౌన్ ముగుస్తోంది. కరోనా నేపధ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలు మళ్లీ తమ రొటీన్ లైఫ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ సమయంలో పోలీసులు కొత్త రూల్స్‌తో ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌ కఠినంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన దగ్గర నుంచి రూల్స్ అతిక్రమించేవారి కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనలను అమలు చేస్తున్నారు.

ఇక బైక్ నడిపేవారు, వెనుక కూర్చున్న వారు ఖచ్చితంగా హెల్మెట్లు పెట్టుకోవాల్సిందే. లేదంటే భారీ ఫైన్ పడుతుంది. ఇక పదేపదే రూల్స్‌ను ఉల్లంఘిస్తే మోటార్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తారు. అటు ఫిబ్రవరి నుంచి బైక్ సైడ్ మిర్రర్స్ లేకున్నా ట్రాఫిక్ పోలీసులు జరిమానా వేస్తున్న సంగతి తెలిసిందే.

తొలిసారి దొరికితే రూ. 100, రెండోసారి దొరికితే రూ. 300 ఫైన్ పడుతుంది. కాగా, ప్రజలు ఫుల్ హెల్మెట్లను మాత్రమే వాడాలని హాఫ్ హెల్మెట్ ఉపయోగించకూడదన్నారు. ఈ కొత్త రూల్స్ అన్నీ కూడా ప్రజల శ్రేయస్సు కోసమేనని సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. అటు సీఎం కేసిఆర్ భాగ్యనగరంలో లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో రోడ్లు రద్దీగా మారాయి.

Read This: తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్ల వివరాలు ఇవే..