‘జూమ్ యాప్’ ను నిషేధించాలని.. సుప్రీం లో పిటిషన్..!
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. చాలామంది ఇంటినుంచే పని చేస్తున్నారు. దీంతో

Zoom App: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. చాలామంది ఇంటినుంచే పని చేస్తున్నారు. దీంతో ‘జూమ్ యాప్’ వినియోగం పెరిగిపోయింది. అయితే.. భారత్‌లో ‘జూమ్ యాప్’ను నిషేధించాలని సుప్రీం కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు అయింది.
వివరాల్లోకెళితే.. జూమ్ యాప్ వినియోగదారుల గోప్యతకు భంగం కలిగించేలా ఉందని హర్ష్ చుగ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. తగిన చట్టాలు రూపొందించేవరకు జూమ్ వీడియో కాలింగ్ యాప్‌పై నిషేధం కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ యాప్ సురక్షింతం కాదని.. ఇందులో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ లేదని తెలిపారు. ఈ యాప్ వినియోగిస్తున్న పలువురి నుంచి హ్యాకింగ్, సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.
మరోవైపు.. జూమ్ యాప్ అంత సురక్షితం కాదని కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ సంస్థ సీఈఓ ఇప్పటికే వినియోగదారులను క్షమాపణ కోరారు. అయితే లాక్‌డౌన్ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ కోసం వ్యక్తులు, సంస్థలు జూమ్ యాప్‌ను విరివిగా ఉపయోగిస్తున్నాయి.



