ఏపీలో ల‌క్ష దాటిన క‌రోనా కేసులు.. ఈ రోజు ఎన్నంటే?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 62,979 శాంపిల్స్ పరీక్షించగా.. అందులో 7,948 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు..

ఏపీలో ల‌క్ష దాటిన క‌రోనా కేసులు.. ఈ రోజు ఎన్నంటే?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 28, 2020 | 5:15 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 62,979 శాంపిల్స్ పరీక్షించగా.. అందులో 7,948 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య ల‌క్ష దాటింది. ప్ర‌స్తుతం 1,07,402 కేసులు నమోద‌య్యాయి. ఇందులో 56,509 యాక్టివ్ కేసులు ఉండగా, 49,745 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక 24 గంట‌ల్లో ఈ క‌రోనా వ‌ల్ల 58 మంది మ‌ర‌ణించారు. వీటితో క‌లిపి ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్‌ మరణాల సంఖ్య 1148కి చేరింది.

కాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 24 గంట‌ల్లో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కేసుల వివ‌రాలుః అనంతపురంలో 740, చిత్తూరులో 452, ఈస్ట్ గోదావరిలో 1367, గుంటూరులో 945, కడపలో 650, కృష్ణలో 293, కర్నూలులో 1146, నెల్లూరులో 396, ప్రకాశంలో 335, శ్రీకాకుళంలో 392, విశాఖపట్నంలో 282, విజయనగరంలో 220, వెస్ట్ గోదావరిలో 757 కేసులు నమోదయ్యాయి. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వరకు 17,49,425 సాంపిల్స్ ని పరీక్షించారు.

Read More: 

ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్ః ఇక‌పై మ‌రింత ఈజీగా ట్రైన్ టికెట్ బుకింగ్‌..

ఏడో నిజాం కుమార్తె బ‌షీరున్నిసా బేగం మృతి

రామ్ గోపాల్ వ‌ర్మ‌కు షాక్.. రూ.4 వేల‌ ఫైన్ విధించిన జీహెచ్ఎంసీ..