ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్ః ఇక‌పై మ‌రింత ఈజీగా ట్రైన్ టికెట్ బుకింగ్‌..

ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది ఇండియ‌న్ రైల్వేస్ సంస్థ‌. ఇక‌పై ప్ర‌యాణికులు మ‌రింత ఈజీగా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను మ‌రింత కొత్త‌గా మార్చి.. ప్ర‌యాణికుల ముందుకు తీసుకురాబోతుంది. ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుకింగ్‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేయాల‌నే ల‌క్ష్యంతో..

ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్ః ఇక‌పై మ‌రింత ఈజీగా ట్రైన్ టికెట్ బుకింగ్‌..
Follow us

| Edited By:

Updated on: Jul 28, 2020 | 4:50 PM

ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది ఇండియ‌న్ రైల్వేస్ సంస్థ‌. ఇక‌పై ప్ర‌యాణికులు మ‌రింత ఈజీగా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను మ‌రింత కొత్త‌గా మార్చి.. ప్ర‌యాణికుల ముందుకు తీసుకురాబోతుంది. ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుకింగ్‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేయాల‌నే ల‌క్ష్యంతో ఇండియ‌న్ రైల్వేస్ ఐఆర్‌సీటీసీ వైబ్‌సైట్‌ను అప్‌గ్రేడ్ చేయ‌బోతుంది. కాగా భార‌త‌ రైల్వే సంస్థ 2018లో టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌ను అప్‌గ్రేడ్ చేసింది. మ‌ళ్లీ ఇప్పుడు అప్‌గ్రేడ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఆర్టిఫిషియ‌ల్‌గానే ఇంటెలిజెన్స్ సాయంతో వెబ్‌సైట్‌ను పూర్తిగా అప్‌డేట్ చేస్తున్న‌ట్లు ఇండియ‌న్ రైల్వేస్ బోర్డు చైర్మ‌న్ వీకే యాద‌వ్ పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కేవ‌లం రైల్వే బుకింగ్స్ మాత్ర‌మే కాకుండా హోట‌ల్ బుక్సింగ్స్, మీల్స్ బుకింగ్ వంటివి కూడా వెబ్ సైటులో ఉంచ‌బోతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. దాదాపు ఆగ‌ష్టులో ఈ వెబ్ సైటు పూర్తిగా ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి వస్తుంద‌న్నారు. ఆర్టిఫిషియ‌ల్‌గా ఇంటెలిజెన్స్ స‌హాయంతో.. ఈజీగా పాసింజ‌ర్స్ టికెట్ బుక్ చేసుకునేలా తీర్చిదిద్దుతున్న‌ట్లు రైల్వే బోర్డు చైర్మ‌న్ వీకే యాద‌వ్ తెలిపారు. అలాగే న్యూ పోర్ట‌ల్ అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌యాణికుల‌కు మంచి అనుభూతి క‌లుగుతుందన్నారు.

ఈ వెబ్ సైట్ ద్వారా సీట్ల వివ‌రాలు సుల‌భంగానే తెలుసుకోవ‌చ్చ‌ని, వెయిటింగ్ లిస్ట్ క‌న్ఫ‌ర్మేష‌న్ వంటి సౌక‌ర్యాలు అందుబాటులోకి వ‌స్తాయ‌ని వివ‌రించారు. అలాగే భార‌త రైల్వేస్.. ఇస్రోతో కూడా భాగ‌స్వామ్యం కుదుర్చుకున్న విస‌యం తెలిసిందే. దీని ద్వారా ప్రయాణికుల‌కు.. ట్రైన్ ఎక్క‌డ ఉంద‌నేది లైవ్ ట్రాకింగ్ ద్వారా తెలుసుకోవ‌చ్చ‌ని తెలియ‌జేశారు భార‌త రైల్వేస్ బోర్డు చైర్మ‌న్ వీకే యాద‌వ్ పేర్కొన్నారు.

Read More: 

వీధి వ్యాపారుల‌కు ఊర‌ట‌.. ఉద‌యం 10 నుంచి రాత్రి 8 వ‌ర‌కు ప‌ర్మిష‌న్..

ఏడో నిజాం కుమార్తె బ‌షీరున్నిసా బేగం మృతి

రామ్ గోపాల్ వ‌ర్మ‌కు షాక్.. రూ.4 వేల‌ ఫైన్ విధించిన జీహెచ్ఎంసీ..