ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ ఎక్కడో తెలుసా..?
TV9 Telugu
21 April 2024
ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించడం అసాధ్యం. ప్రస్తతం ఇంటర్నెట్ లేకుండా ఒక్కరోజు కూడా జీవించలేని పరిస్థితి.
ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ చేయడం జరిగింది. దీని ద్వారానే ప్రజలందరికి కావలసినవి అందుతున్నాయి.
మనదేశంలో సరసమైన ధరలకు అన్ని నెట్‌వర్క్స్ నుంచి ఇంటర్నెట్, డేటాకి సంబందించిన సేవలు అందుబాటులో ఉన్నాయి.
దేశంలోని ప్రతి మూలలో 4G,5G సేవలు అందుబాటులో ఉన్నాయి. నేటి ఆధునిక యుగంలో చాలా పనులు మొబైల్, ఇంటర్నెట్‌పై ఆధారపడి ఉంది.
ఇంటర్నెట్ అత్యంత వేగంగా ఉన్న మొదటి మూడు స్థానాల్లో ముస్లిం దేశాలు ఉన్నాయి. ఆ దేశాలు ఏంటో తెలుసుకుందాం.
వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం, ఇంటర్నెట్ అత్యంత వేగంగా పనిచేసే దేశం ఖతార్. ఇక్కడ కనీస ఇంటర్నెట్ వేగం 313 Mbps.
అత్యధిక ఇంటర్నెట్ స్పీడ్ ఉన్న రెండో దేశం యూఏఈ. కువైట్ మూడో స్థానంలో ఉంది. ఈ జాబితాలో చైనా 7వ స్థానంలో ఉంది.
కాగా అమెరికా 9వ స్థానంలో ఉంది. అంటే ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇంటర్నెట్ వేగం నెమ్మదిగా ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి