24 April 2024
TV9 Telugu
వాట్సాప్ యూజర్లకు శుభవార్త చెప్పింది. యూజర్ల ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే
మరో ఫీచర్ రాబోతోంది. ఈ ఫీచర్ వస్తే ఫొటోలు, వీడియోలు, మీడియా ఫైల్స్ అన్నీ ఆఫ్‌లైన్‌లోనూ షేర్ చేసుకోవచ్చని వాబీటాఇన్ఫో తెలిపింది
మొబైల్‌లో ఇంటర్‌నెట్ సదుపాయం లేకుండా పంపే ఫైల్స్ సైతం ఎన్‌క్రిప్ట్ చేయబడుతాయని.. తద్వారా సెక్యూరిటీ ఉంటుందని నివేదిక పేర్కొంది
కొత్త ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ని సైతం రివీల్ చేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంది. ఇది విజయవంతమైతే త్వరలోనే అందుబాటులోకి..
ప్రస్తుతం ఇంటర్‌నెట్‌ను వినియోగించకుండా ఫైల్స్‌ను షేర్ చేసేందుకు బ్లూటూత్, షేర్‌ఇట్, నియర్‌బై షేర్ అప్లికేషన్స్‌తో ఫైల్స్‌ను షేర్ చేస్తున్న విషయం తెలిసిందే
ఇదే తరహాలోనే మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఈ యాప్‌ను తీసుకురాబోతుంది. ఈ ఫీచర్ ఎనేబల్ చేసుకోవాలంటే వాట్సాప్ సిస్టమ్ ఫైల్, ఫొటోల గ్యాలరీ యాక్సెస్ అనుమతి
ప్రస్తుతం వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌పై సైతం పని చేస్తుంది. చాట్‌లిస్ట్‌లో ఫేవరెట్స్ ఆప్షన్‌ను తీసుకురాబోతుంది
ఇందులో యూజర్లకు తమకు ఇష్టమైన వ్యక్తులను అందులో యాడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దాంతో తరచూ చాట్‌చేసే వారితో పాటు కాంటాక్ట్స్ మొత్తం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు