TV9 Telugu

23 April 2024

రూ. 15వేలకే 5జీ ఫోన్‌.. 

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ మోటోరొలా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మోటోరో జీ64 పేరుతో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఈ 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. గతంలో లాంచ్‌ చేసిన జీ62 ఫోన్‌కు కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేశారు.

ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 33 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. 

8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 14,999కాగా, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 16,999గా నిర్ణయించారు. 

ఈ ఫోన్‌ను ఐస్‌ లైలాక్‌, మింట్‌ గ్రీన్‌, పెర్ల్‌ బ్లూ కలర్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈరోజు (ఏప్రిల్‌ 23) ఉంచే ఈ ఫోన్‌ సేల్‌ ప్రారంభమైంది.

ఇక లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌/ డెబిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1000 డిస్కౌంట్‌ లభిస్తుంది. 50 ఎంపీ రెయిర్‌, 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. 

ఇక ఇందులో 6.5 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. 120Hz రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం. మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 7025 ప్రాసెసర్‌ను ఇచ్చారు.