AP Corona Cases: ఏపీలో కొత్తగా 1,435 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 69,173 కరోనా పరీక్షలు చేయగా.. 1,435  మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా...

AP Corona Cases: ఏపీలో కొత్తగా 1,435 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా
Ap Corona
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 20, 2021 | 4:49 PM

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 69,173 కరోనా పరీక్షలు చేయగా.. 1,435  మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2000038కి చేరింది. కొత్తగా మరో ఆరుగురు మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 13702కి చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 1,695 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 1970864కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 15472 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 2,59,72,539 కరోనా శాంపిల్స్ టెస్ట్ చేసినట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా కోవిడ్ వల్ల చిత్తూర్ జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు.  చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 199 కరోనా కేసులు వెలుగుచూశాయి. నెల్లూరు జిల్లాలో 190 కేసులు నమోదయ్యాయి.

కరోనా సమాచారం ఇక నుండి మీ చేతుల్లోనే:

● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయడి. ● స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు ● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు ● https://esanjeevani.com/ వెబ్ సైట్ ద్వా రా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు. ● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app. క్రింద లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి. https://play.google.com/store/apps/details?id=com.entrolabs.apcovid19

Also Read: AP Weather Alert: రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు

రెండు రాష్ట్రాలు, మూడు జిల్లాలు.. నలుగురు మనుషులు.. రెండు వివాహేతర సంబంధాలు.. ఒక మర్డర్