AP Weather Alert: రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు
మహారాష్ట్రలోని విదర్భతో పాటు.. పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకూ.. 3.1 కిలోమీటర్ల ఎత్తున ఆవరించి ఉన్నట్లు..
మహారాష్ట్రలోని విదర్భతో పాటు.. పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకూ.. 3.1 కిలోమీటర్ల ఎత్తున ఆవరించి ఉన్నట్లు.. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో.. ఒకటీ రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే రెండు, మూడు రోజుల్లో.. రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వచ్చేవారం రోజుల పాటు.. కోస్తాంధ్రలో సాధారణం కంటే అధిక వర్షపాతం కురిసే సూచనలు ఉన్నాయని అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు అమరావతి వాతావరణ కేంద్రం :
ఉత్తర కోస్తాంధ్రా, యానాం : ————————————————— ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలలో ఒకటి లేక రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. రేపు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశంఉంటుంది. ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది
దక్షిణ కోస్తా ఆంధ్ర : —————————— ఈ రోజు రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది .
రాయలసీమ ——————– రాయలసీమ లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంటుంది.
Also Read: రెండు రాష్ట్రాలు, మూడు జిల్లాలు.. నలుగురు మనుషులు.. రెండు వివాహేతర సంబంధాలు.. ఒక మర్డర్