రెండు రాష్ట్రాలు, మూడు జిల్లాలు.. నలుగురు మనుషులు.. రెండు వివాహేతర సంబంధాలు.. ఒక మర్డర్

రెండు రాష్ట్రాలు, మూడు జిల్లాలు.. నలుగురు మనుషులు.. రెండు వివాహేతర సంబంధాలు.. ఒక మర్డర్
Man Murder

నలుగురు మనుషులు. రెండు వివాహేతర సంబంధాలు. ఒక వ్యక్తి దారుణ హత్య. తనవాల్లే అని నమ్మి వెళ్తే చంపి నదిలో పడేశారు. రెండు రాష్ట్రాలు, మూడు జిల్లాల...

Ram Naramaneni

|

Aug 20, 2021 | 2:36 PM

నలుగురు మనుషులు. రెండు వివాహేతర సంబంధాలు. ఒక వ్యక్తి దారుణ హత్య. తనవాల్లే అని నమ్మి వెళ్తే చంపి నదిలో పడేశారు. రెండు రాష్ట్రాలు, మూడు జిల్లాల పరిధిలో జరిగిన ఈ దారుణమైన క్రైం కథా చిత్రంలో నమ్మలేని నిజాలు షాక్‌కు గురిచేస్తున్నాయి. విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. యస్.. అనంతపురం జిల్లా ఎదురూరులో పెద్దయ్య అనే వ్యక్తి మిస్సింగ్ మిస్టరీ వీడింది. కర్నూల్ జిల్లా పత్తికొండలోని సుంకమ్మ అనే మహిళ వద్దకు వెళ్ళిన పెద్దయ్య కృష్ణా నదిలో విగతజీవిగా కనిపించాడు. వివాహేతర సంబంధమే ..హత్యకు కారణమని పోలీసులు విచారణలో తేలింది. పామిడి మండలం ఎదురూరుకు చెందిన పెద్దయ్యకు సుంకమ్మ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆ మహిళ మేనమామ శంకర్… పెద్దయ్య భార్య బాలక్కతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై పెద్దయ్య..శంకర్‌కు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎలాగైనా పెద్దయ్యను చంపేయాలని డిసైడ్ అయిన శంకర్, మేనకోడలు సుంకమ్మ తో ఫోన్ చేయించి పత్తికొండకు రప్పించాడు. అక్కడే పెద్దయ్య హత్యకు పథకం రచించారు. అందుకు మిత్రులు కుంటి శ్రీనివాస్, భాస్కరరెడ్డి సహకారం తీసుకున్నాడు. పెద్దయ్యను మాట్లాడానికి పిలిచి.. టవల్ మెడకు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని జోగులాంబ గద్వాల్ జిల్లా బీచుపల్లి వద్ద కృష్ణా నదిలో పడేశారు.

అక్కడినుండి 7 కిలోమీటర్ల దూరంలో మృతదేహం బయటపడింది. ఆపదను ముందే పసిగట్టిన పెద్దయ్య తాను సుంకమ్మతో చివరిసారిగా మాట్లాడిన సంభాషణ మిత్రులకు షేర్ చేశాడు. ఆ ఆడియో ఆధారంగానే ఈ కేసును చేధించారు పోలీసులు. ఈ సంభాషణ బయటకు రావడం వల్లనే చివరిగా పెద్దయ్య ఎక్కడికి వెళ్ళాడు అన్న విషయం బయట పడింది. ఇలా నలుగురు వ్యక్తుల మధ్య సాగిన వివాహేతర సంబంధాలు ఒక వ్యక్తి దిక్కులేని చావుకు కారణమయ్యాయి.

Also Read: ఒళ్లు కొవ్వెక్కి తిక్క వేశాలు వేసిన ఈవెంట్ మేనేజర్.. గుడ్డలూడదీసి కొట్టిన యువతులు

షేక్ అవుతున్న బాలీవుడ్.. హనీ ట్రాప్‌లో 100 మంది సెలబ్రిటీలు.. 285 మంది నగ్న వీడియోలు స్వాధీనం

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu