Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రిలో 27న సామూహిక వరలక్ష్మీ వ్రతం.. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న వారికి ఉచితం.

Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రిలో 27న సామూహిక వరలక్ష్మీ వ్రతం.. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న వారికి ఉచితం.
Vijayawada Indrakeeladri

vijayawada Indrakeeladri Temple: శ్రావణ మూడో శుక్రవారం సందర్భంగా ఈ నెల 27 తేదీన విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ ప్రకటించారు...

Narender Vaitla

|

Aug 20, 2021 | 2:55 PM

vijayawada Indrakeeladri Temple: శ్రావణ మూడో శుక్రవారం సందర్భంగా ఈ నెల 27 తేదీన విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ ప్రకటించారు. ఈ నెల 27న ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మహామండపం ఆరో అంతస్తులో వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్నారు. వ్రతం టికెట్‌ ధరను రూ. 15000గా నిర్ణయించారు. టెకిట్‌ కొనుగోలు చేసిన భక్తులకు పూజా సామాగ్రిని దేవస్థానమే సమకూర్చుతుందని అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న భక్తులు టికెట్లను దేవదాయ ధర్మాదాయ శాఖ వెబ్‌సైట్‌ https://aptemples.ap.gov.in ద్వారా, దేవస్థాన ఆర్జిత సేవా టికెట్ల కౌంటర్లలో కొనుగోలు చేయవచ్చు. అయితే తెల్ల రేషన్‌ కార్డు ఉన్న భక్తులు ఈ వ్రతంలో పాల్గొనడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇందు కోసం తెల్ల రేషన్‌ కార్డు ఉన్న వారు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి దేవస్థానం 23వ తేదీ నుంచి దరఖాస్తులను పంపిణీ చేయనుంది. ఈ దరఖాస్తులను మహా మండపం గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని టోల్‌ ఫ్రీ కౌంటర్‌లో ఉచితంగా పొందవచ్చు. అంనతరం దరఖాస్తును నింపి.. దాంతో పాటు తెల్లరేషన్‌ కార్డు జిరాక్స్‌ కాపీని జత చేసి 25వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు అందచేయాల్సి ఉంటుంది. ఇక సామూహిక వరలక్ష్మీ వ్రతాల్లో పాల్గొనే భక్తులు తప్పకుండా కోవిడ్‌ నిబంధనలను పాటించాలని ఆలయ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే శ్రావణ రెండో శుక్రవారమైన నేడు (ఆగస్టు 20) ఇంద్రకీలాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుండి భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. ఇక అమ్మవారి మూలవిరాట్ విగ్రహానికి వరలక్ష్మి దేవి అలంకరణ చేశారు. ఆలయ అధికారులు కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్కులు ధరించని భక్తులను ఆలయంలోకి అనుమతివ్వడం లేదు.

Also Read: Pushpa: అన్ని భాషల్లో అదరగొడుతున్న పుష్ప సాంగ్.. యూట్యూబ్ రికార్డ్స్ బద్దలుకొడుతున్న పాట..

Murder Mystery: స్మార్ట్‌లో కారులో ఇస్మార్ట్ స్కెచ్‌..మాట్లాడుతూ మాట్లాడుతూనే మర్డర్‌.. ప్రీ ప్లాన్డ్‌ కోల్డ్‌ బ్లడెడ్ అంటున్న పోలీసులు

రెండు రాష్ట్రాలు, మూడు జిల్లాలు.. నలుగురు మనుషులు.. రెండు వివాహేతర సంబంధాలు.. ఒక మర్డర్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu