AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KRMB: కృష్ణానది యాజమాన్య బోర్డుపై ఏపీ ఒత్తిడి తీవ్రతరం.. 27న కేఆర్ఎంబీ భేటీ నేపథ్యంలో మరో లేఖ

కృష్ణానది యాజమాన్య బోర్డుపై ఏపీ ప్రభుత్వం ఒత్తిడి తీవ్రతరం చేసింది. ఈ నెల 27న కేఆర్ఎంబీ భేటీ జరుగుతుండటంతో తెలంగాణ

KRMB: కృష్ణానది యాజమాన్య బోర్డుపై ఏపీ ఒత్తిడి తీవ్రతరం.. 27న కేఆర్ఎంబీ భేటీ నేపథ్యంలో మరో లేఖ
Krmb Grmb
Venkata Narayana
|

Updated on: Aug 20, 2021 | 2:50 PM

Share

AP Government – KRMB: కృష్ణానది యాజమాన్య బోర్డుపై ఏపీ ప్రభుత్వం ఒత్తిడి తీవ్రతరం చేసింది. ఈ నెల 27న కేఆర్ఎంబీ భేటీ జరుగుతుండటంతో తెలంగాణ ఇప్పటి వరకూ చేసిన వ్యవహారాలన్నిటినీ.. మీటింగ్ లో చర్చించేలా ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ దిశలో మరో సారి కేఆర్ఎంబీకి ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ లేఖ రాశారు. నిబంధనలకు అనుగుణంగా నీటి ప్రాజెక్టు నిర్మాణంతో పాటు.. విద్యుత్ ఉత్పత్తి కూడా చేపట్టడంపైనా ఏపీ గవర్నమెంట్ ఫిర్యాదు చేసింది.

ఇలా ఉండగా, ఈ నెల 27న కేసీఆర్ఎంబీ భేటీ కానుంది. ఇప్పటికే సమావేశంలో చర్చించనున్న.. అంశాలపై రెండు రాష్ట్రాలకు తగిన సమాచారమిచ్చింది కేఈఆర్ఎంబీ. తెలంగాణ సాగిస్తూ వస్తున్న నీటి వినియోగ వ్యవహారాలను ఈసమావేశంలో చర్చించడానికి నిర్ణయించింది. గోదావరి జలాలను కృష్ణాబేసిన్ కు తరలించడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు.. ఆ మేరకు నీటిని తమకు కేటాయించాలని కేఆర్ఎంబీని కోరింది తెలంగాణ ప్రభుత్వం. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అభ్యంతరం తెలిపింది. ఈ విషయమై ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి.. కేఆర్ఎంబీకి నేడు మరో లేఖ రాశారు.

నీటి కేటాయింపులు సమానంగా ఉండాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఒక లేఖ రాసింది. కృష్ణాజలాల వివాదం ట్రిబ్యునల్ 2 తీర్పు వచ్చే వరకూ కృష్ణా జలాలను 70- 30 నిష్పత్తిలో పంచాలని ఏపీ ప్రభుత్వం కోరింది. గతేడాది వరకూ 66- 34 నిష్పత్తిలో నీటిని వాడుకున్న విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇదే సమయంలో తెలంగాణ అక్రమంగా 43 కొత్త ప్రాజెక్టులను కడుతోందనీ.. కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది ఏపీ గవర్నమెంట్. నీటి వాటాలు తేలకుండానే తెలంగాణ ప్రాజెక్టులను చేపట్టిందిని తన లేఖలో తెలిపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

నాగార్జున సాగర్, పులిచింతలలలో విద్యుత్ ఉత్పత్తిలో ఏపీకి కూడా వాటా ఉంది. కానీ, తెలంగాణ ఏకపక్షంగా విద్యుత్ ను వాడుకుంటోందని ఫిర్యాదు చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. తెలంగాణ ప్రభుత్వం కూడా సాగర్ నుంచి యాదాద్రి పవర్ ప్లాంట్ కు నీటిని మళ్లించేలా పైప్ లైన్ వేశారనీ తన లేఖలో తెలియచేసింది. ఇలా ఏపీ, తెలంగాణ.. ఒకరిపై ఒకరు కేఆర్ఎంబీకి పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్న విధం కనిపిస్తోంది. ఇప్పటికే రెండు సార్లు జరిగిన బోర్డు మీటింగ్ కు తెలంగాణ డుమ్మా కొట్టింది. దీంతో ఈ నెల 27న జరగబోయే కేఆర్ఎంబీ మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read also: Minister Avanthi Srinivas: సోషల్ మీడియాలో మంత్రి పేరిట వైరల్ అవుతోన్న రాసలీలల ఆడియో.. అవంతి క్లారిఫికేషన్